36.2 C
Hyderabad
April 25, 2024 19: 01 PM
Slider హైదరాబాద్

టీవీ ఆర్టిస్టు శాంతి అనుమానాస్పద మృతి

artist shanthi

హైదరాబాద్ లోని ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడెం లో మరో దారుణం జరిగింది. టీవీ లలో నటించే శాంతి అనే ఆర్టిస్టు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించింది. గత నాలుగు రోజుల నుంచి ఆర్టిస్ట్ శాంతి తన గదిలోంచి బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన అపార్ట్ మెంట్  వాసులు  పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ దుర్ఘటన వెలుగులోకి వచ్చింది.

టీవీ సీరియల్ లో పనిచేసే ఆర్టిస్టు శాంతి ఇంజనీరింగ్ కాలనీలో మూడు సంవత్సరాలుగా నివసిస్తున్నట్లు అపార్టుమెంటు వాసులు తెలిపారు. ఫిర్యాదు మేరకు పోలీసులు వచ్చి చూడగా ఇంట్లో అనుమానాస్పద గా ఆమె మృతి చెందినట్లు తెలిసింది. ఆర్టిస్ట్ శాంతి మృతి చెందిన సంఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకొని ముమ్మర దర్యాప్తు చేపట్టారు.

Related posts

నాగోబా ఆలయాన్ని సందర్శించిన బండారు దత్తాత్రేయ

Satyam NEWS

ములుగు శ్రీ క్షేత్రంలో శ్రావణ మాస మొదటి శుక్రవారం పూజలు

Satyam NEWS

నివర్ తుఫాను బాధితులకు వి ఎస్ యు ఎన్ ఎన్ ఎస్ చేయూత

Satyam NEWS

Leave a Comment