36.2 C
Hyderabad
April 23, 2024 22: 42 PM
Slider ప్రత్యేకం

ట్వీట్ అండ్ డిలీట్: అన్నా ఇక చాలే వదిన్ని పిలువు

pvp twitt

సైన్యంలో మహిళాధికారులకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించేందుకు దేశం సిద్ధమౌతున్న తరుణంలో ఆ నేపథ్యంతో ట్వీట్ పెట్టి స్వామిభక్తిని ప్రదర్శిద్దామనుకున్నాడో వైసిపి నాయకుడు. కథ బూమ్ రాంగ్ కావడంతో నాలిక కరుచుకుని ఆ ట్వీట్ ను డిలీట్ చేశాడు పాపం.

వైసిపి నేత పొట్లూరి వరప్రసాద్ ఈ సంచలనానికి నేడు కేంద్ర బిందువు అయ్యాడు. మహిళను ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా చూడాలని పివిపి అనుకున్నాడట. ఇదే సారాంశంతో ట్వీట్ పెట్టాడు. బూజు పట్టిన సాంప్రదాయాలకు తెరదించుతూ. మగ ఆఫీసర్స్ ఆడవారి ఆర్టర్లను తీసుకోరు అనే ప్రభుత్వ వాదనను పక్కనపెట్టి… కొత్త శకానికి నాంది పలికిన సుప్రీంకోర్టు.

ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు ఆడవారికి సమాన ఆస్తి హక్కులు కల్పించి, మన తెలుగు కుటుంబాల ఉదారతను ప్రపంచానికి తెలియజేశారు. అదే స్ఫూర్తితో మన తెలుగువారు కూడా మన ఆడపడుచులను గౌరవిస్తూ, తెలుగు మహిళా ముఖ్యమంత్రిని చూడాలని కోరుకుంటున్నాను. అవకాశాల్లో సగం, ఆస్తిలో సగం, ప్రజా ప్రతినిధులలో సగం, ప్రభుత్వంలో సగం అనేది ఆయన ట్వీట్ సారాంశం.

ఇక్కడ మహిళా ముఖ్యమంత్రి అనే సరికి కథ అడ్డం తిరిగింది. ప్రస్తుత ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ అక్రమాస్తుల కేసు ట్రయల్ ప్రారంభంకాగానే బెయిల్ రద్దు అవుతుందని, ఆ తర్వాత ఆయన భార్య వై ఎస్ భారతిని ముఖ్యమంత్రిని చేస్తారని కొద్ది కాలంగా పుకార్లు వ్యాపించి ఉన్నాయి.

కొన్ని అధికారిక సమావేశాలలో కూడా ఆమె కనిపించారని వారికి గిట్టని వారు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ దశలో పివిపి ఈ విధమైన ట్వీట్ పెట్టడంతో పైన చెప్పిన పుకార్లన్నీ నిజమేమో అనే భావన కలుగుతున్నది. దాంతో పివిపి ట్వీట్ క్షణాల్లోనే వైరల్ అయింది. ఒక్క సారిగా వైసిపి నాయకులు ఉలిక్కిపడ్డారు. ఇదేమిటి అంటూ విరుచుకుపడ్డారు దాంతో ట్వీట్ ను ఆయన డిలీట్ చేసుకున్నారు.

దాంతో స్క్రీన్ షాట్లను వైరల్ చేస్తున్నారు. మహిళా ముఖ్యమంత్రి అంటే భారతి అవుతారా? లేక వై ఎస్ జగన్ చెల్లెలు షర్మిల ముఖ్యమంత్రి అవుతారా? లేక జగన్ తల్లి వై ఎస్ విజయ లక్ష్మి సిఎం అవుతారా? ఏ మహిళ సిఎం కావాలని పివిపి కోరుకుంటున్నారనేది కూడా విస్తృత చర్చకు తావిస్తున్నది.

Related posts

కోవిడ్ పేరుతో పగటిపూట 144 సెక్షన్ అమలు చేయవద్దు

Satyam NEWS

కరోనా నుంచి ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసమే లాక్ డౌన్

Satyam NEWS

పుష్ప సినిమాతో మంచి గుర్తింపు లభించింది: నటి అక్షర

Satyam NEWS

Leave a Comment