జీహెచ్ఎంసి పరిధిలో ఎక్కడ పడితే అక్కడ అనధికారికంగా పోస్టర్లు, బానర్లు, ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారని, వాల్ రైటింగ్ చేసినా క్లియర్ ఫొటోలతో @CEC_EVDM ట్విట్టర్ లో ఫిర్యాదు చేయవచ్చునని EVDM డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి తెలిపారు. పౌరులు ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఫిర్యాదులపై సెంట్రల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్ సోషల్ మీడియా ఉద్యోగులు స్పందించి ఇ-ఛలాన్ విధిస్తారని అన్నారు.
సి.ఇ.సి సోషల్ మీడియా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుందని తెలిపారు. ఆ సమయంలో వచ్చిన ట్విట్టర్ పోస్టులపై వెంటనే చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. సాయంత్రం 6 గంటల తర్వాత వచ్చిన ట్విట్టర్ పోస్టులపై మరుసటి రోజు చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిబంధనల అమలులో పౌరుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ట్విట్టర్ ఖాతాను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.