22.2 C
Hyderabad
December 10, 2024 11: 50 AM
Slider తెలంగాణ

జర్నలిస్టు సురేశ్ ను పరామర్శించిన TWJF నేతలు

suresh

హైదరాబాద్ లో గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యం తో చికిత్స పొందుతున్న మన తెలంగాణ పత్రిక రిపోర్టర్  కె.సురేష్ కుమార్ ను తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(TWJF) రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, ఉపాధ్యక్షులు పులిపలుపుల ఆనందంలు శనివారం పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన సురేష్ కుమార్ కు ఐదు వేల రూపాయల ఆర్ధిక సహాయం అందించారు. సురేష్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న సోమయ్య ఆయనకు,ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. సురేష్ కు లివర్ బాగా డ్యామేజ్  అయిందని,లివర్ మార్పిడి కోసం ఆపరేషన్ చే యడానికి  దాదాపు 15 లక్షలు ఖర్చవుతుందని  నిమ్స్ వైద్యులు చెప్పినట్లు సురేష్ కుటుంబ సభ్యులు తెలిపారు. దాదాపు పాతికేళ్ళుగా ప్రజాశక్తి, ఈనాడు, ఈటీవీ,సూర్య, వార్త తదితర పత్రికల్లో పని చేసి, ప్రస్తుతం మన తెలంగాణలో చేస్తున్న సురేశ్ కు ఈ పరిస్థితి రావడం బాదాకారం. భార్య,ముగ్గురు చిన్న పిల్లల(అమ్మాయిలు)లతో అద్దె ఇంట్లో వుంటూ మంచాన పడిన సురేశ్  ఆరోగ్య పరిస్థితి మెరుగుపడి పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. సురేష్ వైద్యానికి అయ్యే ఖర్చులు ప్రభుత్వం భరించాలని, అతని కుటుంబాన్ని ఆదుకో వాలని సోమయ్య కోరారు.

Related posts

వివేకానంద రెడ్డి హత్యలో జగన్ కుటుంబ పాత్ర బట్టబయలు

Satyam NEWS

ఇండియా-పాక్‌ మ్యాచ్ కు దిమ్మదిరిగే వ్యూస్

Sub Editor

కారు-ఆర్టీసీ బస్సు ఢీ, ఇద్దరు మృతి

Satyam NEWS

Leave a Comment