24.7 C
Hyderabad
March 29, 2024 07: 35 AM
Slider వరంగల్

వరద నీటిలో కొట్టుకుపోయిన అన్నదమ్ములు

#MuluguFloods

చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లిన అన్నను కాపాడేందుకు తమ్ముడు కూడా కొట్టుకుపోయిన దురదృష్టకర సంఘటన ములుగు జిల్లాలో జరిగింది.

ములుగు మండలం బండారుపల్లి గ్రామానికి చెందిన  అల్లం శివాజీ (41) అతని తమ్ముడు అల్లం యువరాజు (25) చేపలు పట్టేందుకు ఇంచెర్ల  గ్రామ శివారుకు వెళుతండగా ప్రమాదం జరిగింది.

మార్గ మధ్యంలో జంగాలపల్లి క్రాస్ రోడ్ సమీపంలోని రామప్ప చెరుకు వరద నీరు భారీ ఎత్తున వచ్చింది. దాంతో శివాజీ నడుపుతున్న మోటార్ సైకిల్ కొట్టుకుపోయింది.

అన్నను కాపాడేందుకు వరదలోకి వెళ్లిన తమ్ముడు

బండితో బాటు అన్న కూడా కొట్టుకుపోతుండటంతో వెనుక కూర్చుని ఉన్న తమ్ముడు అన్నను కాపాడేందుకు ప్రయత్నించాడు. వరద ఉధృతి మరింత పెరగడంతో ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకుపోయారు.

సమాచారం అందుకున్న ములుగు ఎస్ ఐ బండారు రాజు హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చారు. తక్షణమే ఏటూరునాగారం ఐటి డిఏ అధికారులకు సమాచారం అందించారు.

దాంతో వారు కూడా వచ్చి వరద నీటిలో కొట్టుకుపోయిన అన్నదమ్ముల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.

Related posts

దేవీ ఫోటో స్టూడియో చోరీ ఘ‌ట‌న‌లో జువైన‌ల్ పాత్ర‌

Satyam NEWS

కెసిఆర్ గుండెలో ‘ఈట’ను దింపిన మోడీ

Satyam NEWS

అరసవెల్లిలో భక్తులకు పులిహోర ప్యాకెట్లు పంపిణీ

Satyam NEWS

Leave a Comment