27.7 C
Hyderabad
April 26, 2024 03: 10 AM
Slider విజయనగరం

విజయనగరంలో ఆక్సిజన్ అందక ఇద్దరు మృతి?

#maharajahospital

ఈ కరోనా సెకండ్ వేవ్..కారణం గా ప్రతీ ఒక్కరికీ ఆక్సిజన్ అవసరమని చెప్పక తప్పదు.ఈ పరిస్థితి ల్లో కరోనా మూలంగా ఆక్సిజన్ అవసరమని డాక్టర్లు నొక్కి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్రంలో ని విజయనగరం జిల్లా కేంద్ర హాస్పిటల్ లో ఆక్సిజన్ అందక రోగులు ఇబ్బందులు పడ్డారన్న వార్త పెను సంచలనమైంది.

అర్థరాత్రి జిల్లా కేంద్ర హాస్పిటల్ లో మార్చురీ పక్కనే ఉన్న ఆక్సిజన్ సరఫరాలో లోపం తలెత్తింది. దీంతో హాస్పిటల్ లో సాధారణ రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరీ ముఖ్యంగా హాస్పిటల్ లో కరోనా చికిత్స కోసం చేరిన రోగులకు సకాలంలో ఆక్సిజన్ అందక పోవడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. విషయం కాస్త బయట పడి మీడియా కు చేరడంతో తెల్లరేసరికి మీడియా మొత్తం జిల్లా హాస్పిటల్ కు చేరుకుంది.ఘటన జరిగిన వెంటనే అర్థరాత్రే కలెక్టర్ స్పందించి..జేసీ మషేష్ కుమార్ ను పంపించారు.

దీంతో జేసీ మహేష్ కుమార్… ఆర్డీవో భవానీ శంకర్, విజయనగరం ఎమ్మార్వో లు కలిసి హాస్పిటల్ కు చేరుకుని విచారణ చేపట్టారు. ఆక్సిజన్ సరఫరా లోపం తలెత్తడంతో ఉన్న పళంగా జేసీబీని తెప్పించి…ఆక్సిజన్ సరఫరా అయ్యె చోట తవ్వ..లీకేజీ ని కనుగొన్నారు.

దాదాపు మూడు గంటల తర్వాత సమస్య సరిదిద్దారు.అంతవరకూ జేసీ ,డీఎస్పీ, ఆర్డీవో సూపరెంటెండెంట్ ఛాంబర్ లో ఉండి పరిస్థితి సమీక్షించారు. ఈ మేరకు తనను కలిసిన మీడియా తో జేసీ మాట్లాడుతూ.. ఆక్సిజన్ సరఫరా అందక ఇద్దరు మృతిచెందారని..అధిక సంఖ్యలో కాదని చెప్పారు. కొద్ది గంటలలోనే సమస్య సరిదిద్దామన్నారు.

ఆక్సిజన్ సరఫరా ప్రదేశాన్ని పరిశీలించిన డీఎస్పీ

మహారాజ హాస్పిటల్ లో ఆక్సిజన్ అందక కరోనా రోగులు ఇబ్బందులు పడుతున్నారన్న విషయం తెలుసుకున్న నగర డీఎస్పీ అనిల్ తన బృందంతో ఆక్సిజన్ సరఫరా అయ్యే ప్రదేశాన్ని పరిశీలించారు. కేవలం ఇద్దరు మాత్రమే మృతి చెందినట్లు జిల్లా అధికారులు చెబుతున్నారు. అయితే ఆక్సిజన్ అధిక సంఖ్యలో మృతి చెందారన్న వార్తలో నిజం లేదని పోలీసులు సైతం చెబుతున్నారు.

Related posts

పాత్రునివలసలో ఘనంగా జాతీయ రాజ్యాంగ దినోత్సవం

Bhavani

Atrocious: యువతి కిడ్నాప్: సామూహిక అత్యాచారం: దారుణ హింస

Satyam NEWS

మాంచి కిక్కిచ్చే క్రైమ్ థ్రిల్లర్ “రెక్కీ”

Satyam NEWS

Leave a Comment