ఇద్దరు మావోయిస్టు కొరియర్లను అరెస్టు చేసినట్లు భద్రాచలం ఏఎస్ పి రాజేష్ చంద్ర తెలిపారు. ఖమ్మం జిల్లా చర్ల మండలం లో crpf 141 బెటాలియన్, పోలీసులు సంయుక్తంగా వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా వీరిద్దరూ పట్టుబడ్డారు.
అక్కడ అనుమానంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను తనిఖీ చేయగా వారి వద్ద నిషేధిత మావోయిస్టు పార్టీ కి సరఫరా చేస్తున్న మెడికల్ కిట్స్, నలుగురి మావోయిస్టులు బ్లడ్ శాంపిల్స్, ఇంజెక్షన్స్ లు పట్టుబడ్డాయి. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని కోర్టు లో ప్రొడ్యూస్ చేస్తున్నట్లు ఏఎస్ పి తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపిఎస్ రోహిత్, crpf 141 అసిస్టెంట్ కమాండర్ గీతమ్మ, ci సత్యనారాయణ, si రాజువర్మ పాల్గొన్నారు.