27.7 C
Hyderabad
April 26, 2024 04: 57 AM
Slider ప్రత్యేకం

సోము వీర్రాజుకు రెండు నెలల పరీక్షా కాలం

#somu verraju

దక్షిణాది రాష్ట్రాలలో ఓట్ బ్యాంక్ ను పదిలం చేసుకుంటే తప్ప రాబోయే రోజుల్లో అధికారంలో కొనసాగలేమని తెలుసుకున్న బిజెపి అధిష్టానం ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలలో ఇప్పటికే ఆ దిశగా చర్యలు తీసుకున్న బిజెపి ఇప్పుడు ఆంధ్రా, తెలంగాణ పై దృష్టి సారించింది. కర్నాటకలో వృద్ధుడైన ముఖ్యమంత్రిని మార్చడం ద్వారా మార్పులకు బిజెపి శ్రీకారం చుట్టింది.

నలుగురికి కేంద్ర మంత్రి వర్గంలో స్థానం కల్పించి వచ్చే ఎన్నికలలో బిజెపి మళ్లీ అధికారం సాధించడమే కాకుండా అన్ని పార్లమెంటు స్థానాలను గెలిచేందుకు వ్యూహం పన్నింది. తమిళనాడులో బిజెపి అధ్యక్షుడుగా కె.అణ్ణామలైని నియమించడమే కాకుండా ఎల్.మురుగన్ ను కేంద్ర మంత్రిగా చేసింది. తెలంగాణ లో చురుకుగా పని చేసే పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ ను అధ్యక్షుడుగా నియమించడం, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డికి ప్రమోషన్ ఇవ్వడం ద్వారా వారిద్దరే పార్టీకి సారధులు అనే సంకేతాన్ని పంపింది.

దక్షిణాది రాష్ట్రాలలో అతి కీలకమైన ఆంధ్రప్రదేశ్ పై త్వరలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తున్నది. ఇప్పటికే ముగ్గురు సభ్యలు కమిటీతో ఆంధ్రాలో పార్టీ పరిస్థితిపై నివేదిక తెప్పించుకున్న బిజెపి అధిష్టానం ఒక్కొక్కటిగా నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉన్నా, పవన్ కల్యాణ్ లాంటి బలమైన మాస్ లీడర్ అండ వున్నా బిజెపి ఎదగలేకపోవడానికి గల కారణాలను ముగ్గురు సభ్యుల కమిటీ అధిష్టానానికి నివేదించినట్లు తెలిసింది.

మరీ ముఖ్యంగా గత ఎనిమిది నెలల కాలంలో బిజెపి ఎలాంటి ప్రభావం చూపించకుండా నిస్తేజంగా ఉండిపోయింది. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో ఘోర పరాజయం తర్వాత రాష్ట్రంలో బిజెపి కనిపించకుండా పోయింది. పవన్ కల్యాణ్ ఓట్లు తప్ప బిజెపికి ఓట్లే రాకపోవడంతో రాష్ట్ర పార్టీ నాయకత్వంపై అధిష్టానానికి భ్రమలు తొలగిపోయాయి.

అంతే కాకుండా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అంటకాగే నాయకులతో పార్టీకి తీరని నష్టం కలుగుతున్న విషయాన్ని కూడా ముగ్గురు సభ్యుల కమిటీ కేంద్రానికి నివేదించినట్లు తెలిసింది. నలుగురు నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ‘‘గుడ్ బుక్స్’’లో ఉన్నట్లు కూడా కేంద్ర కమిటీ గుర్తించింది. పార్టీకి అంకిత భావంతో పని చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాధామ్యాలనే తలకెత్తుకుంటున్న వీరికి ఉద్వాసన పలికితే తప్ప పార్టీకి బేస్ కూడా ఏర్పడదనే నిర్ణయానికి కేంద్ర కమిటీ వచ్చింది.

వీరిని అదుపు చేయలేకపోతున్న రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజును సాగనంపితే తప్ప పార్టీకి నూతన జవసత్వాలు వచ్చే అవకాశం లేదని కూడా ముగ్గురు సభ్యుల కమిటీ నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. కేంద్ర పార్టీ నుంచి ఇన్ చార్జిగా ఉన్న సునీల్ ధియోదర్ వ్యవహార శైలి పై కూడా కేంద్ర కమిటీ సంతృప్తికరంగా లేనందున ఆయన మార్పు కూడా తథ్యమని అంటున్నారు.

ఈ విషయాలు తెలుసుకున్న ‘‘ఆ నలుగురు’’ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై నేరుగా విమర్శలు చేయడం ప్రారంభించారు. అదే విధంగా సోము వీర్రాజు కూడా వచ్చే రెండు నెలల కాలంలో తన నాయకత్వ పటిమను నిరూపించుకోకపోతే మార్పు తధ్యమని చెబుతున్నారు.     

Related posts

ఒకే గొడుగు కిందకు మొత్తం నీటిపారుదల శాఖ?

Satyam NEWS

పెద్దమనసు చాటుకున్న పినపాక ఎమ్మెల్యే

Satyam NEWS

తొలకరి

Satyam NEWS

Leave a Comment