32.7 C
Hyderabad
March 29, 2024 11: 24 AM
Slider ముఖ్యంశాలు

నీతులు చెప్పే ఆ రెండు పత్రికలు చేస్తున్నదేమిటి?

China-journalists

జర్నలిస్టులకు అక్రిడిటేషన్ రావాలంటే యాజమాన్యం తప్పనిసరిగా ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి. అలా ఇస్తే ఏపి ప్రభుత్వం నుంచి చిక్కులు వస్తాయనే ఉద్దేశ్యంతో రెండు ప్రముఖ దిన పత్రికలు మొహం చాటేస్తున్నాయి. గ్రామీన ప్రాంతాలలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఎలాంటి అప్పాయింట్ మెంట్ ఉండదు.

ఆయా సంస్థలు వారిని తమ ఉద్యోగులుగా కూడా ఎక్కడా చెప్పదు. అయితే ఇంత కాలం వారికి ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు కార్డుల సమయంలో సహకరించేది. సమాచార శాఖ కు వీరంతా మా రిపోర్టర్లు అని ధ్రువీకరిస్తూ లెటర్లు ఇచ్చేవారు. అయితే ఏపిలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా తమ ఉద్యోగులుగా ధృవీకరిస్తూ లెటర్ ప్యాడ్ మీద యాజమాన్యం ఇస్తే భవిష్యత్తులో తల నొప్పులు వస్తాయని వారు భావిస్తున్నారు. దీంతో రెండు ప్రముఖ దిన పత్రికల కు సంబంధించి ప్రతి రోజు ప్రధాన కార్యాలయానికి ఫోన్ చేసి లెటర్లు పంపమన్నా అక్కడి నుంచి స్పందన మాత్రం ఉండటం లేదు.

ఒక ప్రముఖ పత్రికకు సంబంధించి ఐదు మందిని మాత్రమే ధ్రువీకరిస్తూ ఆ పత్రిక యాజమాన్యం జిల్లాకు ఉత్తర్వులు పంపింది. మరో ప్రముఖ పత్రిక సంబంధించి ఏడు మంది మాత్రమే తమ సంస్థలో ఉన్నట్లు యాజమాన్యం అధికారిక పత్రం పంపింది. ఈ రెండు దినపత్రికలకు సంబంధించి మిగిలిన జర్నలిస్టుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

Related posts

బీహార్ లో ధర్మల్ పవర్ ప్లాంట్ కు రైతుల నిరసన

Satyam NEWS

పేర్లు మార్పుతో బతుకులు మారుతాయా ?

Satyam NEWS

నరసరావుపేటలో భారీ ఎత్తు రేషన్ బియ్యం స్మగ్లింగ్

Satyam NEWS

Leave a Comment