వివిధ కారణాలతో తప్పిపోయిన వారి ఆచూకీ తెలిస్తే పోలీసులకు తెలియ చేయాలని జనగాం జిల్లా పాలకుర్తి ఎస్ఐ గండ్రాతి సతీష్ కోరారు.
పాలకుర్తి మండలం లక్ష్మినారాయణపుం గ్రామానికి చెందిన మహ్మద్ లాల్ బీ (60) ఈ నెల మూడున ఇంట్లో నుండి బయటకు వెళ్ళింది.
అప్పటి నుంచి లాల్ బీ తిరిగి ఇంటిక రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. వారి బంధువుల గ్రామాల్లో,ఇతర ప్రదేశాలలో వెతికినా ఆమె ఆచూకి లభ్యం కాలేదు.
వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్ధేపల్లి, గూడేళ్ళగూడెం గ్రామానికి చెందిన పెండ్లి కుమార్ (30) అంగవైకల్యంతో ఇబ్బంది పడుతూ ఈ నెల 27న ఇంట్లో నుండి వెళ్లాడు.
బయటకు వెళ్ళిన కుమార్ తిరిగి రాలేదు. తల్లి పూలమ్మ,లాల్ బీ కూతురు మహ్మద్ రఫీయా ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐతెలిపారు.
వారి ఆచూకి తెలిస్తే 9440700549,9440904658 నంబర్లకు ఫోన్ చేసి ఆచూకి తెలపాలని కోరారు.