40.2 C
Hyderabad
April 24, 2024 16: 24 PM
Slider జాతీయం

శిక్షణ హెలికాప్టర్ కూలి ఇద్దరు పైలెట్ల మృతి

#helecaptor

గురువారం రాయ్‌పూర్‌ విమానాశ్రయంలో శిక్షణ హెలికాప్టర్‌ కూలిపోయింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని రామకృష్ణ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ప్రమాదంలో గాయపడిన పైలట్లిద్దరూ మరణించినట్లు వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ ట్వీట్ ద్వారా విచారం వ్యక్తం చేశారు.

రాయ్‌పూర్‌లోని విమానాశ్రయంలో స్టేట్‌ హెలికాప్టర్‌ కూలిన ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ విషాద ప్రమాదంలో పైలట్లు కెప్టెన్ పాండా, కెప్టెన్ శ్రీవాస్తవ ఇద్దరూ మరణించారని, ఈ దుఃఖ సమయంలో భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించాలని ఆయన ఆకాంక్షించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అని ముఖ్యమంత్రి తెలిపారు.

రాయ్‌పూర్‌లోని స్వామి వివేకానంద విమానాశ్రయంలో గురువారం రాత్రి 9.10 గంటల ప్రాంతంలో రాష్ట్రానికి చెందిన హెలికాప్టర్ కూలిపోయిందని చత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇది సాధారణ శిక్షణ విమానం కాగా ఈ ప్రమాదానికి సాంకేతిక లోపమే కారణమని ప్రాథమిక సంకేతాలు సూచిస్తున్నాయి. ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించడానికి DGCA మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలపై వివరణాత్మక సాంకేతిక విచారణ జరుగుతుంది.

Related posts

ఎమ్మెల్యే మల్లాది విష్ణు కుల ప్రస్తావన తెచ్చిన టిడిపి

Satyam NEWS

ప్రభుత్వ వైఫల్యమే మణిపూర్ ఘటన

Bhavani

జగన్ అక్రమ సంపాదనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్

Bhavani

Leave a Comment