30.7 C
Hyderabad
April 19, 2024 09: 13 AM
Slider కడప

రెండేళ్ల పాలనా సంబరాలా..నవ్విపోదురుగాక..

#CPIKadapa

జగన్ పాలనపై కడపజిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య ధ్వజమెత్తారు. వైసీపీ నేతలు సీఎం జగన్ రెండేళ్ల పాలనా సంబరాలు జరుపుకోవడం హాస్యాస్పదమని,సంక్షేమం పేరిట రెండేళ్లు రాష్ట్రాభివృద్ది పక్కన పెట్టేసారని,ఏదో సాధించినట్లు వైసీపీ నేతలు సంబరాలు జరుపుకోవడం అందుకు సీఎం తలూపడం ఏంటని  గుజ్జల ఈశ్వరయ్య ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు.

ప్రజావేదిక కూల్చివేతతో పాలన మొదలెట్టి రాజధాని విధ్వంసంతో అనేక సంస్థలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయాయని. అమరావతిలో  లక్షల కోట్ల ప్రభుత్వ సంపద నిరర్థకం చేయడంతో రాష్ట్రంలో భూముల విలువ పడిపోయి, ఏపీలో ఎకరం అమ్ముకొని తెలంగాణలో రెండు ఎకరాలు కొనే స్థితి  తలక్రిందులైందని అన్నారు.

సీఎం జగన్మోహన్ రెడ్డి రెండేళ్లలోనే 95 శాతం హామీల్ని అమలు చేశామని  చెప్పుకోవడం సిగ్గుచేటని  నవరత్నాల మోసాలతో అభివృద్ధి ఆటకెక్కించారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.అమ్మఒడికి రూ. 14 వేలు ఇచ్చి నకిలీ మద్యం తో రూ.36 వేలు గుంజు కుంటున్నారని విదేశీ విద్య రద్దు చేశారని, ఫీజు రీయంబర్స్ మెంట్ కుదించిన ప్రభుత్వమని దుయ్యబట్టారు మోసకారి సంక్షేమం, నకిలీ రత్నాలే అన్నారు.

రెండేళ్లలో నేరాలు, ఘోరాలు, మోసాలు, ధరలు, పన్నులు, అప్పులు, విధ్వంసాలు పెరిగి వైసీపీ నేతల దోపిడీ కొండంత పెరిగిందని మద్యం, ఇసుక, సిమెంట్ మాఫియా సిండికేట్ల ద్వారా హెూల్ సేల్ అవినీతిలో మించిపోయారని ఆగ్రహం వ్యక్తంచేశారు

హామీలు అమలు చేశామని చెప్పుకుంటున్నారని వైసీపీ నేతల అంకెల గారడీ అన్నారు.ఉచిత ఇసుకను రద్దు చేసి. రూ. 1500 వున్న ట్రాక్టర్ ఇసుకను రూ. 5 వేలకు పెంచారన్నారు. దీనితో 125 వృత్తులు, వ్యాపారాలు దెబ్బతిన్నాయన్నారు

తాజాగా రాష్ట్రంలోని ఇసుకనంతా ఒక్కరికే కట్టబెట్టారని. తాడేపల్లి ప్యాలెస్ కు  ముడుపులు చేరుతున్నాయని ఆరోపించారు.మద్యం రేట్లు మూడు రెట్లు పెంచారు. దీనితో ప్రజల కుటుంబ ఆదాయాలు తలక్రిందులయ్యాయన్నారు మద్యం దుకాణాల్ని కరోనా వ్యాప్తి కేంద్రాలుగా మార్చారని మండి పడ్డారు.మద్యనిషేదం హామీపై మడమ త్రిప్పి రేట్లు పెంచడమేకాక లక్షల సంఖ్యలో మొబైల్ బెల్టు షాపులు పెట్టించారని విమర్శించారు.

పారాసిటమాల్, కరోనా మహమ్మారితో సహజీవనం అని సిద్ధాంతం చెప్పి కరోనా కట్టడికిముందస్తు చర్యలు తీసుకోకుండా. రాష్ట్రాన్ని శవాలదిబ్బగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారన్నారు.

అధికార లెక్కల ప్రకారం 10 వేల మందికి పైగా కరోనాతో చనిపోయారని,అనధికార లెక్కల ప్రకారం 30 వేల మందికి పైగానే చనిపోయారని ఆరోపించారు.

వైకాపా డ్రగ్ మాఫియా వల్ల కుటుంబాల ఆదాయం తలక్రిందులైందని బాధితులకు ఇతర రాష్ట్రాలవలే ప్యాకేజీ ఇవ్వలేదు. వ్యాక్సిన్‌కు రూ. 1,600 కోట్లు అవసరం కాగా కేవలం రూ.45 కోట్లు మంజూరు చేశారని దుయ్యబట్టారు.భారతీ సిమెంట్ లాభాల కోసం బస్తా సిమెంటుపై రూ. 100 ధర పెంచారు. సిమెంటు సిండికేట్ నుండి వేలకోట్లు ముడుపులు దండుకుంటున్నారు.

విశాఖ ఉక్కు భూములు 7 వేల ఎకరాలు అమ్ముకోమని సీయం కేంద్రానికి లేఖ రాశారని, ప్రజల, కార్మికుల కళ్లు కప్పెట్టడానికి అసెంబ్లీలో ఉత్తుత్తి తీర్మానం చేశారన్నారు.

కరోనా కష్టకాలంలోను పన్నులు పెంచారు. ధరలు పెంచారని, అప్పులు పెంచారని,. ఒక్కొక్క కుటుంబంపై రూ.2.50 లక్షల భారం మోపి ఇచ్చింది గోరంత, భారాలు కొండంత.6 లక్షల మందికి ఇచ్చే నిరుద్యోగ భృతి రద్దు చేశారన్నారు.జగన్ రెడ్డి పెట్టిన బీమా పథకం కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తిస్తుందన్నారు.రైతు రుణమాఫీ రద్దు చేసి రూ. 8 వేల కోట్లు రైతులకు దక్కకుండా చేశారన్నారు.

మితిమీరిన అప్పులు చేయడానికి షరతులకు లొంగి వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెడుతున్నాడన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టడమంటే రైతు మెడకు ఉరి వేయడమే కాదా…? అని ప్రశ్నించారు.రూ.3 లక్షల వరకు వున్న సున్నా వడ్డీని లక్ష రూపాయలకే పరిమితం చేశారని,గతానికి విరుద్ధంగా రైతు ముందుగా బ్యాంకుకు చెల్లిస్తే తరువాత రీయంబర్స్ చేస్తానని రూల్స్ మార్చి రైతుకు ద్రోహం చేశారన్నారు.

రాష్ట్ర నిధుల నుండి రైతు భరోసాకు రూ. 13,500 ఇస్తామని హామీ ఇచ్చి రూ.7,500లకుకోత కోశారన్నారు. ఏడాదికి రూ. 6 వేల లెక్కన 5 ఏళ్లలో 30 వేలు ఎగనామం పెట్టారు. రూ. 15 వేలు వచ్చే అన్నదాత సుఖీభవ రద్దుచేశారన్నారు.రూ. 4 లక్షలకు పైగా విలువతో నాణ్యంగా నిర్మించిన ఎన్టీఆర్ గృహాలను లబ్ధిదారులకు కేటాయించకుండా ద్రోహం చేశారన్నారు. జగనన్న గృహాల విలువ రూ.1.80 లక్షలకు కుదించారని, ఇందులో కేంద్రం ఇచ్చేది రూ.1.50 లక్షలు పోగా జగన్ రెడ్డి ఇచ్చేది రూ.30 వేలు మాత్రమే అని విమర్శించారు.

సెంటు పట్టా పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రకుల పేదల అసైన్ మెంట్ భూములు 10 వేల ఎకరాల్నిబలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. సెంటు పట్టాలో వేల కోట్లు వైసీపీ నేతలు దిగమింగారని ఆరోపించారు. పింఛన్ రూ. 250 మాత్రమే పెంచారు. గడువు తీరినా పెంచకుండా ఒక్కొక్కరికి రూ.18వేలు ఇప్పటికే ఎగనామం పెట్టారు. పెళ్ళి కానుకలు రద్దు చేశారు. సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక రద్దు చేశారన్నారు.ఇంటికి రేషన్ అంటూ   ప్రజాధనాన్ని దుబారా చేశారని రేషన్ డీలర్లకడుపు కొట్టారు. బీసీ కార్పొరేషన్లకు నిధులు కోత పెట్టారు. ఆదరణ పథకం రద్దు చేశారు. కాపు రిజర్వేషన్లు 5% రద్దు చేశారు. ఈబీసీ రిజర్వేషన్లు అమలు చేయలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సబ్ ప్లాన్లను నిర్వీర్యం చేసి, నిధులు దారి మళ్లించారని ఆరోపించారు.

సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పరిషత్ ఎన్నికలు నిర్వహించారని, నరేగా బిల్లుల చెల్లింపుపై హైకోర్టు తీర్పులను ఉల్లంఘిస్తున్నారు. హైకోర్టు, సుప్రీం కోర్టున్యాయమూర్తుల పై అనుచిత పోస్టులపై సీఐడీ అధికారులు చర్యలు తీసుకోలేదు. జడ్జిల ఫోన్ ట్యాపింగ్ ను తేల్చలేదన్నారు

రెండేళ్లలోనే జగన్ రెడ్డి ప్రభుత్వం  నేరాలు, విధ్వంసాలు, దోపిడీలు, దుష్ప్రచారాలు,మానవ హక్కులు, రాజ్యంగ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డారన్నారు.విధ్వంసాలు, విద్వేషాలురెచ్చగొట్టి ప్రభుత్వ నిధుల్ని, సహజ సంపదను కొల్లగొడుతు. వారి కాల్ సేల్ దోపిడీ నుండి ప్రజల దృష్టి మరలించడానికి కుల, మత, ప్రాంతీయ చిచ్చు పెట్టి వైకాపా తప్పుదనాలు కప్పి పెట్టుకునే నాటకమాడు తున్నారని మండి పడ్డారు.

సీపీఎస్ రద్దు చేస్తానన్న హామీ ఏమైందని 6 టి ఏ డి ఏ లు పెండింగ్ మాటేమిటన్నారు. ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాల   పర్మినెంట్ హుళక్కేనా అని ప్రశ్నించారు. ఇసుక మాఫియా,మద్యం మాఫియా,సిమెంట్ మాఫియా చెలరేగుతున్నాయన్నారు. వాహన మిత్రతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ రేషన్ డీలర్ల కడుపు కొడుతున్న ప్రభుత్వం రెండేళ్ల పాలనా సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు వైసీపీ నేతల అబద్ధపు ప్రచారాలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని స్పష్టంచేశారు.

Related posts

నారా లోకేష్ యువగళం పాదయాత్ర షెడ్యూల్ ఇది

Satyam NEWS

కొల్లాపూర్ కు రోడ్డు సౌకర్యం మెరుగుపరచాలి

Satyam NEWS

10న బి‌ఆర్‌ఎస్ పార్టీ సమావేశం

Murali Krishna

Leave a Comment