28.7 C
Hyderabad
April 24, 2024 03: 33 AM
Slider శ్రీకాకుళం

డాక్టర్ మోహన్ కు జాతీయ స్థాయి ఉగాది పురస్కారం

#Balamohan

15 సంవత్సరాల నుంచి  వ్యాయామ విద్య వృత్తి లో ఉన్న శ్రీకాకుళం జిల్లాకు  చెందిన డాక్టర్ గుండబాల  మోహన్ కు 2021 సంవత్సరానికి  జాతీయ  స్థాయి  ఉగాది పురస్కారం దక్కింది.

ఆయన పలు ఉపాధ్యాయ శిక్షణా కళాశాలలో వ్యాయామ అధ్యాపకుడుగా, పలు ఇంజనీరింగ్ కళాశాలలో వ్యాయామ విద్య ఆచార్యునిగా పని చేశారు. 2013 సంవత్సరం నుంచి  శ్రీకాకుళం గ్రామీణ మండలంలోని పెద్దపాడు ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు గా పని చేస్తున్నారు.

ఆయన వద్ద శిక్షణ పొందిన పలువురు విద్యార్థులు జిల్లా  స్థాయి, రాష్ట్ర  స్థాయి, జాతీయ స్థాయి, కుస్తీ పోటీలో నూ, వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని  విజయాలు సాధించారు. అదేవిధంగా ఆయన పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 

విద్యార్థినీ విద్యార్థులు అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నప్పుడు వారికి ఆర్థిక సహాయం కూడా చేశారు. ఆయన పేద విద్యార్థుల క్రీడా ప్రతిభను వెలికి తీసి ఆయన తన సొంత ఖర్చులతో విద్యార్థులను రాష్ట్రస్థాయి జాతీయస్థాయి పోటీలకు పంపిస్తున్నారు.

ఆయన క్రీడా రంగానికి చేసిన సేవ, సామాజిక  సేవలకు గాను జాతీయ స్థాయి ఉగాది పురస్కారం 2021 కు ఎంపికయ్యారు.  జాతీయ స్థాయి ప్రతిభ , కళలు ( ఆర్ట్స్) అసోసియేషన్ వారు ఈ పురస్కారం అందజేస్తున్నారు.

ఈ పురస్కారం  ఏప్రిల్  నెల పదో తారీఖున హైదరాబాదు  లో ప్రముఖుల సమక్షంలో ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా  తనను ఈ జాతీయ  స్థాయి ఉగాది పురస్కారానికి  ఎంపిక చేసిన సీ. సీ. టీవీ అధ్యక్షుడైన డాక్టర్. ఆరవెల్లి నరేంద్ర కి ప్రత్యేక  కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

న్యూ ఇయర్ నేపథ్యంలో ఏపిలో కొత్త మద్యం బ్రాండ్లు

Bhavani

కొల్లాపూర్ లో యూత్ జోడో బూత్ జోడో

Satyam NEWS

మై ఒపీనియన్ : ఇందిరాగాంధీ గ్యాంగ్ స్టార్ల ఇంటికి వెళ్ళేది

Satyam NEWS

Leave a Comment