31.7 C
Hyderabad
April 18, 2024 23: 26 PM
Slider పశ్చిమగోదావరి

రాట్నాలమ్మ దేవాలయంలో ఉగాది వేడుకలు

#ratnalamma

ఏలూరు జిల్లా పెదవేగి మండలం రాట్నాలకుంట రాట్నాలమ్మ దేవాలయం లో శోభ కృత నామ సంవత్సర ఉగాది వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలు రాష్ట్ర ఆయిల్ పె డ్ రైతు కమిటీ మాజీ చైర్మన్ కొటారు దంపతుల ఆధ్వర్యం లో జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శర్మ ఉగాది పంచాంగ శ్రవణాన్ని వినిపించారు. రాశిల వారిగా ప్రజా జీవన విధానం, లాభం నష్టాలు వివరించారు. ఈ ఉగాది అన్ని వర్గాల ప్రజలకు, అన్ని రాసులవారికి శుభకరం గాను, లాభం దాయకం గాను ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, పెదవేగి జెడ్ పి టి సి సభ్యులు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పెనుమాల విజయ్ బాబు, ముక్కు సర్వేశ్వరరావు, ఆలయ ఈ ఓ నెల్లూరి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

అమ్మ భాష కమ్మదనం

Satyam NEWS

ప్రయివేటు ఆసుపత్రులను తక్షణమే జాతీయం చేయండి

Satyam NEWS

హైదరాబాద్ కు ప్రారంభమైన విమానాల రాకపోకలు

Satyam NEWS

Leave a Comment