34.2 C
Hyderabad
April 19, 2024 20: 45 PM
Slider ఆధ్యాత్మికం

ఏప్రిల్ 2న టిటిడి అనుబంధ ఆలయాల్లో ఉగాది వేడుకలు

#tirumala

టిటిడి పరిధిలోని తిరుపతి, పరిసర ప్రాంతాల్లోని ఆఏప్రిల్ 2న టిటిడి అనుబంధ ఆలయాల్లో ఉగాది వేడుకలులయాల్లో శనివారం శ్రీ శుభ‌కృత్‌నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించనున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీకోదండరామాలయంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగనున్నాయి.

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు స్నపన తిరుమంజనం వైభవంగా జరుగనుంది.
అనంతరం సాయంత్రం 6 నుంచి 7.30 గంటల వరకు పుష్పపల్లకీలో అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు. రాత్రి 8 నుంచి 8.30 గంటల వరకు పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు.
అదేవిధంగా శ్రీ సూర్య‌నారాయ‌ణ స్వామివారి ఆల‌యంలో ఉద‌యం 7 నుండి 7.45 గంట‌ల వ‌ర‌కు శ్రీ సూర్య‌నారాయ‌ణ స్వామివారి ఉత్స‌వ‌ర్ల‌కు అభిషేకం, సాయంత్రం 5 నుండి 5.30 గంట‌ల వ‌ర‌కు ఆస్థానం నిర్వ‌హించ‌నున్నారు.

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 నుండి 6.30 గంట‌ల వ‌ర‌కు పంచాంగ శ్రవణం, ఉగాది ఆస్థానం జ‌రుగ‌నుంది.

శ్రీ కోదండరామాలయంలో

తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో మ‌ధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జీయర్‌ స్వామివారు మూలవర్లకు, ఉత్సవర్లకు వస్త్రసమర్పణ చేయనున్నారు.

Related posts

జనవరి 18 నుంచి కంటి వెలుగు

Murali Krishna

కరోనా వ్యాప్తిపై వ్యాఖ్యానించిన చైనా ప్రొఫెసర్ అరెస్టు

Satyam NEWS

మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలో పతాకావిష్కరణ

Satyam NEWS

Leave a Comment