35.2 C
Hyderabad
April 24, 2024 14: 25 PM
Slider ప్రపంచం

కంపెన్సెషన్ అండ్ సారీ: భారీ నష్టపరిహారం చెల్లించాలి

ukrain president

ఉక్రెయిన్ కు చెందిన బోయింగ్ విమానం తమ వల్లే కూలిపోయిందని… అయితే, కేవలం మానవ తప్పిదం కారణంగానే అది జరిగిందని ఇరాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ స్పందించారు. జరిగిన ఘటనపై ఇరాన్ పూర్తి స్థాయిలో బహిరంగ విచారణ జరపాలని, దీనికి కారకులైనవారిని చట్టం ముందు నిలబెట్టాలని అన్నారు. దౌత్య మార్గాల ద్వారా అధికారికంగా ఇరాన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జరిగిన దానికి భారీ నష్టపరిహారం కూడా చెల్లించాలని అన్నారు.

ఎలాంటి అలసత్వాన్ని ప్రదర్శించకుండా విచారణను ఇరాన్ కొనసాగిస్తుందనే ఆశాభావాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ కు చెందిన ఓ విచారణ బృందం ఇప్పటికే ఇరాన్ లో ఉందని చెప్పారు. 45 మంది నిపుణులతో కూడిన తమ టీమ్ కు ఇరాన్ సహకరించాలని, వారికి కావాల్సిన అన్నింటినీ అందుబాటులో ఉంచాలని కోరారు. ఇరాన్ కూల్చేసిన ఈ విమానంలో ఉన్న మొత్తం 176 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

Related posts

IT Consulting Hourly Rates By Country and Specialization

Bhavani

వనపర్తిలో  మంత్రి పేరు చెప్పుకుని బెల్లం అమ్మకాలు

Satyam NEWS

నా భూమి ఆక్రమిస్తున్నారు అధికారులూ కాపాడండి

Satyam NEWS

Leave a Comment