24.7 C
Hyderabad
March 29, 2024 07: 21 AM
Slider గుంటూరు

Ultimate Tragedy: కుప్పలు తెప్పలుగా…. కరోనా శవాలు

#coronadeaths

కరోనా మృతుల చితిమంటలు ఆరడం లేదు. గుంటూరు డొంకరోడ్డు సమీపంలోనున్న బొంగరాలబీడు శ్మశానవాటికలో దహన క్రియలకు ఎనిమిదిచోట్ల ఏర్పాటు ఉంది. అయితే  ఈ వాటికలో ఎక్కడంటే అక్కడ తగలబడుతున్న చితులు కనిపస్తున్నాయి. 20వ తేదీన ఈ శ్మశానవాటికలో 51 శవాలకు దహన సంస్కారాలు జరిగాయి. అందులో 35 మంది కరోనాతో మృతి చెందినవారే. 21 మధ్యాహ్నానికే 34 మంది కరోనా మృతులకు ఇక్కడ అంత్యక్రియలు నిర్వహించారు. ఇలాచూస్తే, గత నాలుగు రోజుల్లోనే ఈ ఒక్క శ్మశానవాటికలోనే ఇంచుమించు 130 కరోనా మృతులకు అంత్యక్రియలు జరిగాయి. గుంటూరు నగరంలోనే ఉన్న కొరిటపాడు శ్మశానవాటిక సైతం శవాల గుట్టలతో నిండిపోయింది. ఇక్కడ ఈ నాలుగురోజుల్లో 50కు పైగా కరోనా మృతదేహాలకు దహన సంస్కారాలు జరిగాయి. అదే విధంగా స్తంభాలగరువులోని శ్మశానవాటికకూ తాకిడి ఎక్కువగానే ఉంటోంది. ఇక్కడ 20 వరకు కరోనా మృతదేహాలకు గత నాలుగు రోజుల్లో అంతిమ సంస్కారాలు జరిగాయి. కరోనా బారిన పడి మృతి చెందిన వారికి కుటుంబాలొచ్చి అంత్యక్రియలు నిర్వహించిన సంఘటనలు తక్కువే. అత్యధిక మృతదేహాలకు పలు సేవా సంస్థల నిర్వాహకులు దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.

Related posts

పటాన్చెరులో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

Satyam NEWS

‘క్ష‌ణం క్ష‌ణం’ ఉత్కంఠ రేపే చిత్రంః హీరో ఉద‌య్ శంక‌ర్

Satyam NEWS

బ్రుటల్:పెళ్ళైపిల్లలు ఉన్నాయువతిఫై పెట్రోల్ పోసి నిప్పు

Satyam NEWS

Leave a Comment