32.2 C
Hyderabad
March 28, 2024 22: 59 PM
Slider నిజామాబాద్

మాజీ ఐఏఎస్ ఉమాపతి రావు అంత్యక్రియలు పూర్తి

#Umapathi Rao Kamineni

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, కామినేని వంశస్తులు కామినేని ఉమాపతి రావు అంత్యక్రియలు దోమకొండలో నిర్వహించారు. కామినేని కుటుంబ సభ్యులతో పాటు సినీనటులు మెగాస్టార్ చిరంజీవి దంపతులు, ఆయన కుమారుడు రాంచరణ్ తేజ్, కోడలు ఉపాసన అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

అంత్యక్రియల ప్రక్రియను రాంచరణ్, ఉపాసనలు దగ్గరుండి అన్ని తామై పర్యవేక్షించారు. కామారెడ్డి జిల్లా దోమకొండ గడికోట వారసుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కామినేని ఉమాపతి రావు గత బుధవారం హైదరాబాద్ లో మృతి చెందిన విషయం తెలిసిందే.

అయితే గత రెండు రోజుల క్రితమే ఆయన అంత్యక్రియలు జరగాల్సి ఉండగా అమెరికాలో ఉన్న ఆయన కూతురు రాక ఆలస్యం కావడంతో నేడు దోమకొండలో అంత్యక్రియలు నిర్వహించారు. ఉమాపతి రావుకు దోమకొండ గ్రామం అంటే అమితమైన ప్రేమ. అందుకే ఆయన అంత్యక్రియలు ఇక్కడే జరపడానికి నిశ్చయించారు.

ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు గ్రామస్తులు, పలువురు నాయకులు, అధికారుల సందర్శనార్థం గడికోటలో ఉమాపతిరావు పార్థివ దేహాన్ని ఉంచారు. సుమారు 10 గంటల ప్రాంతంలో సినీ నటుడు రాంచరణ్ తేజ్ గడికోటకు చేరుకుని ఉమాపతి రావుకు నివాళులర్పించారు. రాంచరణ్ వచ్చిన సుమారు 20 నిమిషాలకు మెగాస్టార్ చిరంజీవి దోమకొండకు చేరుకుని ఉమాపతి రావు పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

 నిమిషాలజిల్లా కలెక్టర్ శరత్ కుమార్, జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ తేజాస్ నందన్ లాల్ పవార్, అదనపు కలెక్టర్ వెంకటేష్ దొత్రేలు ఉమాపతిరావు పార్థివ దేహంపై పుష్పగుచం ఉంచి నివాళులర్పించారు. సుమారు గంట పాటు వివిధ కార్యక్రమాలు పూర్తి చేసుకుని అంతిమ యాత్ర చేపట్టే సమయంలో తేనెటీగలు ఒక్కసారిగా అక్కడివారిపై దాడి చేశాయి.

చిరంజీవి, రాంచరణ్, ఉపాసనలతో పాటు కామినేని కుటుంబ సభ్యులపై తేనెటీగలు దాడి చేయగా అంత్యక్రియలు 15 నిమిషాల పాటు ఆలస్యంగా సాగాయి. తేనెటీగల దాడిలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంత ఊపిరి పీల్చుకున్నారు.

అనంతరం గడికోట నుంచి ప్రత్యేక వాహనంలో గ్రామంలోని లక్ష్మీభాగ్ లో ఉమాపతి రావు అంత్యక్రియలు నిర్వహించారు. శాస్త్రోక్తంగా జరిగిన ఈ అంత్యక్రియల్లో ఉమాపతి రావు కుమారుడు కామినేని అనిల్ తండ్రి చితికి నిప్పంటించారు.

Related posts

దొంగ సర్టిఫికెట్లతో మోసం చేసిన మంత్రి మల్లారెడ్డి కాలేజీ

Satyam NEWS

బిఆర్ ఎస్ లో చేరనున్న బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ

Bhavani

ఫిరాయింపులు ప్రోత్సహిస్తే పుట్టగతులు లేకుండా చేస్తాం!

Bhavani

Leave a Comment