39.2 C
Hyderabad
April 25, 2024 15: 01 PM
Slider గుంటూరు

ప్రాణాలు తోడేస్తున్న అనధికార చిట్ ఫండ్లు

#chitfunds

తెలుగు రాష్ట్రాల్లో అనధికార చిట్ ఫండ్ కంపెనీ లతో చాలా మంది ప్రజలుఆర్థికంగా నష్టపోతున్నారు. అంతే కాకుండా ప్రభుత్వఆదాయ నికి కూడా గండి పడుతుంది. చిట్ బాధితులు కొంతమంది ప్రాణాలు కోల్పోయి కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా బాధ పడుతున్నారు. ఇక అనాధరైజుడు ప్రయివేట్ చిట్స్ ప్రతి ప్రాంతం లో పేద,మధ్యతరగతి వారిని దోచేస్తున్నాయి. మధ్యలో ఫైనాన్స్ వ్యాపారస్తులు అదికవడ్డీకి బాకీలు ఇస్తూ, లక్షలల్లో చిట్ నడుపుతూ పాటదారులు వద్ద చట్ట విరుద్ధంగా అక్రమంగా ప్రొనోట్స్, బ్యాంక్ చెక్స్, ఇల్ల అగ్రిమెంట్ కాగితాలు ఇలా అనేక విధాలుగా ఏమార్చి ఖాళీ పత్రాలపై సంతకాలు చేయుంచుకొంటూ బాధ పెడుతున్నారు. చక్ర వడ్డీ, అసలు చెల్లించలేక బాధితులు ప్రాణాలు కోల్పోయి, వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నారు.

దీనికి తోడు అనేక షాపుల్లో కూడా వడ్డీదారుల ఆగడలు పెరిగి చిరు వ్యాపారులు వీరి బారిన పడుతున్నారు. పల్లె, పట్టణ ప్రాంతల్లో ఈ దారుణాలు ఎక్కువైనాయి. చట్టంలోని లొసుగులు అడ్డం పెట్టుకుని బాధితులపైన ఎక్కువ మొత్తం బాకీగా చూపిస్తూ కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. ముఖ్యం గా ఆంద్రలోని కోస్తా,పలానాడు ప్రాంతల్లో, తెలంగాణ హైదరాబాద్ ప్రాంతల్లో 2015వ సంవత్సరము నుండి కాల్ మని కేసులు, ఆత్మహత్య కేసులు ప్రభుత్వలకు తలనొప్పిగా మారుతూ లా &ఆర్డర్ దారితప్పుతుంది. ఈ అక్రమార్కుల వలన అనేకరుపాల్లో ప్రభుత్వఆదాయానికి కూడా గండి పడుతుంది.

పలనాడు జిల్లా నరసరావుపేట పట్టణ రూరల్ ప్రాంత పరిధిలో150షాపులు ముఖ్యంగా పలనాడు రోడ్డులోని షాపుల్లో గొప్యం గా ఈ దoదా…పదిపదిహేను షాపుల్లో కొనసాగుతుందాని సమాచారం. ఈ వ్యవహారం పై సంభంధిత రిజిస్టర్, సేల్స్ టాక్స్, పోలీస్ నిఘా ప్రభుత్వ సంస్థలు దాడులు చెయ్యాలి. అలా చేస్తే అక్రమాలు వెలుగులోకి వస్తాయి. ఇటీవల పట్టణ పరిధిలో రెండు ఆత్మహత్యలు జరిగాయి. కొన్ని రిజిస్ట్రేషన్, కోర్టు కేసులు పెండింగ్లో ఉండటం వలన లీగల్ సమస్యలు వస్తాయి అని అధికారులు భయపడుతున్నారు.ఈ దారుణఅకృత్యాలు ఆపాలని ప్రజలు కోరుకుంటూ అనేక పిర్యాదులు సంబదించిన అధికారులకు తెలిపారు.

Related posts

భోక్త బ్రాహ్మణులకు నిత్యావసరాల పంపిణీ

Satyam NEWS

బ్రాహ్మణులకు అన్యాయం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం

Satyam NEWS

వ‌చ్చే నెల 15 నుంచీ రాష్ట్ర వ్యాప్తంగా క్లాప్ ప్రొగ్రామ్

Satyam NEWS

Leave a Comment