35.2 C
Hyderabad
April 20, 2024 18: 04 PM
Slider రంగారెడ్డి

అనుమతులులేని క్లినిక్‌, ఆసుపత్రులపై ఆకస్మిక తనిఖీ

#HealthClinic

సరైన అనుమతులు లేకుండా క్లినిక్‌లు, ఆసుపత్రులను నడిపితే కఠిన చర్యలు తప్పవని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ మల్లిఖార్జునరావు హెచ్చరించారు.

మంగళవారం మేడ్చల్‌ జిల్లా మండల కేంద్రం కీసరలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి సరైన అనుమతులు, అర్హతలు లేని క్లినిక్‌, ఆసుపత్రులను సీజ్‌ చేశారు.

ఈ సదర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ మల్లిఖార్జునరావు మాట్లాడుతూ.. పై అధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో పనిచేస్తున్న నకిలీ వైద్యులను గుర్తించేందుకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.

తనికీలో భాగంగా కీసర మెయిన్‌రోడ్‌, గ్రామంలో ఎటువంటి అర్హతలు, అనుమతులు లేకుండా అనధికారికంగా పనిచేస్తున్న సాయిరుషి క్లినిక్‌, ప్రథమ చికిత్సా కేంద్రం, ఫార్మసీలను సీజ్‌ చేసినట్లు వెల్లడించారు. 

ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే ఇలాంటి వారిపై చట్ట పరమైన కఠిన చర్యలు తీసుకుంటామాని హెచ్చరించారు. జిల్లాల్లో ఎక్కడైనా అనుమతులు లేకుండా క్లినిక్‌లు గాని, ఆసుపత్రులు గాని నడిపినట్రైతే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.

ఈ తనిఖీల్లో కీసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్‌ సరిత, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఇల్లంతకుంట వాగు నీటికి అఖిలపక్షం పాదయాత్ర

Satyam NEWS

గుడిసెలు తగలబెట్టిన వారిని వెంటనే శిక్షించాలి

Satyam NEWS

పోలీసు శాఖ ఆధ్వర్యంలో “కేన్సర్”పై అవగాహన కొరకు “రన్”

Satyam NEWS

Leave a Comment