ఉండవల్లి ఎమ్మెల్యే శ్రీదేవి దళిత మహిళ కాదని క్రిష్టియన్ అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు అన్నారు. వినాయక చవితి పండుగ రోజున తెలుగుదేశం పార్టీకి చెందిన కొమ్మినేని కుటుంబీకులు ఆమెను ఘోరంగా అవమానించిన విషయం తెలిసిందే. దేవుడికి కొబ్బరికాయ కూడా కొట్టకుండా ఎమ్మెల్యే శ్రీదేవి వెనుతిరిగారు. ఈ సంఘటనకు సంబంధించి నలుగురిపై పోలీసులు కేసు పెట్టారు. అయితే అసలు ఆమె దళిత మహిళ కాదని చంద్రబాబునాయుడు చెప్పడం గమనార్హం. తాను క్రిస్టియన్ అని, భర్త కాపు కులస్తుడని ఆమె ఇంటర్వ్యూలో చెప్తే వైసీపీవాళ్ళు దళితమహిళగా రాజకీయం చేస్తున్నారు. టిడిపి వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు. ఎస్సీలకు కేటాయించిన అసెంబ్లీ సీటు క్రిస్టియన్ కు కట్టబెట్టి, అన్యాయం చేసింది వైసీపీ కాదా అని ఎస్సీలే నిలదీస్తుంటే మీ జవాబేంటి? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.
previous post