30.7 C
Hyderabad
April 19, 2024 07: 09 AM
Slider ప్రత్యేకం

హైదరాబాద్ కు భూగర్భ మెట్రో:ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడి

మొట్టమొదటిసారిగా హైదరాబాద్ నగరంలో భూగర్భ మెట్రో తీసుకురానున్నట్లు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. రెండో దశలో రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు చేపట్టనున్న 31 కి.మీ. మెట్రో కారిడార్‌లో విమానాశ్రయం సమీపంలో 2.5కి.మీ. అండర్‌ గ్రౌండ్ మెట్రో నిర్మించనున్నట్లు చెప్పారు. రాయదుర్గం నుంచి విమానాశ్రయం వరకు నిర్మించనున్న మెట్రో కారిడార్‌కు రూ. 6,250 కోట్లు ఖర్చవుతుందని.. ఆ ఖర్చును పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ అమీర్‌పేట్‌ మెట్రో స్టేషన్‌లో మెట్రో రైల్‌ ఐదేళ్ల వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలో మెట్రో రైలు ప్రారంభించి ఐదేళ్లు గడిచిన సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు.ఇదిలా ఉంటే నగరవాసుల నుంచి మెట్రోకు మంచి స్పందన వస్తుందని ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు.మెట్రో రైల్‌ అందుబాటులోకి వచ్చిన మొదటి రోజే రెండు లక్షల మంది ప్రయాణించారని వెల్లడించారు.ప్రస్తుతం నిత్యం నాలుగు లక్షల 40వేల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారని వెల్లడించారు. రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు వరకు (31కి.మీ.) మెట్రో రెండో దశ నిర్మాణానికి డిసెంబర్ 9వ ముఖ్యమంత్రి కేసీఆర్,శంకుస్థాపన చేయనున్నారు.

Related posts

సింహాచలంపై సీఎం జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టేసిన హైకోర్టు

Satyam NEWS

తిరుమల ఘాట్ రోడ్లపై కనువిందు చేస్తున్న జింకలు

Satyam NEWS

తెలంగాణను ముంచెత్తుతున్న భారీ వర్షాల పట్ల అప్రమత్తం

Satyam NEWS

Leave a Comment