26.2 C
Hyderabad
February 14, 2025 00: 50 AM
Slider ప్రత్యేకం

కేంద్ర బడ్జెట్ హైలైట్స్ ఇవే

#budget

బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ కు ఉపయోగపడేవి చాలా వున్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అధికారంలో వున్నారు కాబట్టి, తన అడ్మినిస్ట్రేషన్‌తో చక్కగా వినియోగించుకోవడానికి ఉపయోగపడే బడ్జెట్ అంశాలు ఇవి. గత ఐదేళ్లు రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంటు కట్టక కోల్పోయిన నిధులు వేల కోట్ల వరకు వుంటుంది. ఇప్పుడు వాడుకోనే వారికి వాడుకొన్నంత వెసులుబాటు ఇస్తుంది కేంద్రం. అందులో ఏపిలో ఉన్నది డబుల్ ఇంజిన్ సర్కారు కాబట్టి ఎంపీలను సమన్వయం చేసుకొని రాబట్టుకొని పనిచేయించుకొంటే వ్యవసాయ రంగం, ఎంఎస్ఎంఈ, స్టార్టప్‌లు, బొమ్మల తయారీ, సోలార్, ఈవీ, బ్యాటరీ, పరిశ్రమలు, మెడికల్ కాలేజీలు, మెడికల్ టూరిజం, త్రాగు నీరు, విమానాశ్రయాలు, పట్టణాల అభివృద్ధికి చక్కగా బడ్జెట్‌ను వాడుకోవచ్చు.

కేంద్ర బడ్జెట్ హైలైట్స్:

1. గురజాడ అప్పారావు సూక్తిని ప్రస్తావించిన నిర్మలా సీతారామన్‌- ‘దేశమంటే మట్టి కాదు.. దేశమంటే మనుషులోయ్’ అని ప్రస్తావించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.

2. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత. రైతుల ఆదాయాన్ని పెంచడానికి చర్యలు. వంద జిల్లాలను ఎంపిక చేసి వ్యవసాయంలో అధునూతన పద్ధతుల అమలు. గ్రామీణ ప్రాంతాల్లో సంపద సృష్టించడానికి చర్యలు. గోదాములు, నీటిపారుదల, రుణ సౌకర్యాల కల్పన- 1.7 కోట్ల గ్రామీణ రైతులకు లబ్ధి.

3. పండ్లు, కూరగాయల ఉత్పత్తికి నూతన పథక

4. పప్పు ధాన్యాల ఉత్పత్తికి స్వయం సమృద్ధి పథకం

5. త్వరిత, సమ్మిళిత అభివృద్ధి, పెట్టుబడుల సాధన లక్ష్యంగా బడ్జెట్

6. ఎగుమతుల్లో 45 శాతం వరకు ఎంఎస్ఎంఈల భాగస్వామ్యం

7. ఎంఎస్ఎంఈలకు వచ్చే ఐదేళ్లలో రూ.1.5 లక్షల కోట్లు

8. 27 రంగాల్లో స్టార్టప్‍లకు రుణాల కోసం ప్రత్యేక కార్యాచరణ

9. బొమ్మల తయారీలో దేశాన్ని ప్రపంచస్థాయిలో నిలిపేలా ప్రత్యేక కార్యక్రమం

10. మేడిన్ ఇండియా బ్రాండ్ కింద బొమ్మల తయారీకి ప్రత్యేక ప్రోత్సాహం

11. క్లీన్‍టెక్ మిషన్ కింద సోలార్, ఈవీ, బ్యాటరీ పరిశ్రమలకు ప్రోత్సాహం

12. పరిశ్రమలకు ప్రోత్సాహం కోసం నేషనల్ మానుఫ్యాక్చరింగ్ మిషన్

13. వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 75 వేల కొత్త మెడికల్ సీట్లు

14. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లు

15. సంస్కరణలకు ప్రోత్సాహంగా రాష్ట్రాలకు 5 ఏళ్ల వ్యవధితో వడ్డీ లేని రుణాలు

16. జల్ జీవన్ మిషన్ కింద 15 కోట్ల మందికి రక్షిత మంచినీరు అందించాం

17. ప్రతి ఇంటికీ రక్షిత మంచినీరు అందించేందుకు మరిన్ని నిధులు

18. రాష్ట్రాలు, యూటీలతో ఒప్పందం ద్వారా 100 శాతం మంచినీటి కుళాయిలు

19. 8 కోట్ల మంది చిన్నారులు, కోటి మంది బాలింతల కోసం అంగన్వాడీ 2.0

20. దేశవ్యాప్తంగా 50 వేల పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్‍ల ఏర్పాటు

21. 120 కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు

22. వచ్చే పదేళ్లలో 4 కోట్లమంది కొత్త ప్రయాణికులకు సౌకర్యం

23. ప్రభుత్వం, ప్రైవేటు, పోర్టుల భాగస్వామ్యంతో మారిటైమ్ మిషన్

24. వృద్ధి కేంద్రాలుగా పట్టణాల అభివృద్ధికి రూ. లక్ష కోట్లతో ప్రత్యేక మిషన్

Related posts

సీఎం కేసీఆర్ కృషితో అన్నిరంగాల్లో తెలంగాణ అభివృద్ధి

mamatha

మంగళగిరి వెళ్లి అడగండి తెలుస్తుంది

Satyam NEWS

శ్మశానం లో మొక్కలు నాటిన ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్…!

Satyam NEWS

Leave a Comment