26.7 C
Hyderabad
May 1, 2025 05: 59 AM
Slider ముఖ్యంశాలు

కేసీఆర్ బాటలో నడుస్తున్న సీఎం రేవంత్ రెడ్డి

#BANDI SANJAY

కేసీఆర్ బాటలోనే సీఎం రేవంత్ రెడ్డి నడుస్తున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు. బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి మర్చంట్ బ్యాంకర్స్ ద్వారా అధిక వడ్డీలకు వేలాది కోట్ల రూపాయల అప్పులు తెచ్చే కుట్రలకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని విమర్శించారు. దీంతో రాష్ట్ర ప్రజలపై మోయలేని భారం పడుతుందన్నారు. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు.

అసెంబ్లీ బడ్జెట్, కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అన్నీ గాడిద గుడ్డే అన్నారు. 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలూ గాడిద గుడ్డే అన్నారు. నీతి అయోగ్ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకాకపోవడం దుర్మార్గమన్నారు. భారత్‌ను నెంబర్ వన్‌గా తీర్చిదిద్దడం, కేంద్ర రాష్ట్ర సంబంధాల బలోపేతమే లక్ష్యంగా నీతి అయోగ్ సమావేశం జరుగుతుందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అవకాశవాద పార్టీలు అని విమర్శించారు. అవకాశం వస్తే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం అవడం ఖాయమని జోస్యం చెప్పారు. కాళేశ్వరంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి డ్రామాలు ఆడుతున్నాయన్నారు.

Related posts

ఏడు రోజల త‌ర్వాత‌ విజ‌య‌న‌గ‌రం డివిజ‌న్ లో ప్ర‌వేశించిన దిశ జాగృతి యాత్ర‌

Satyam NEWS

నీటి సమస్య తీర్చిన ఎమ్మెల్యే తూడి

Satyam NEWS

ఎల్కతుర్తి ఎస్సై సస్పెండ్

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!