23.8 C
Hyderabad
September 21, 2021 22: 40 PM
Slider జాతీయం

త్వరలోనే కొల్లాపూర్ కు రానున్న కేంద్ర మంత్రులు

#nitingadkari

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న బీజేపీ నాయకుడు ఎల్లేని సుధాకర్ రావు ఆహ్వానం మేరకు కేంద్ర మంత్రులు పర్యటించనున్నారు. కొల్లాపూర్ ప్రాంతం మీదుగా జాతీయ రహదారి, సోమశిల బ్రిడ్జి తీసుకురావాల్సిన సుధాకర్ రావు ఇప్పుడు కేంద్ర మంత్రులు ఇక్కడ పర్యటించేందుకు ఆహ్వానించారు. తాజాగా హైవే, బ్రిడ్జి సర్వే పూర్తి కావడంతో.. కేంద్ర బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి, బీజేపీ నాగర్ కర్నూల్ నియోజకవర్గ ఇంచార్జి దిలీపాచారి తో కలిసి  ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి ని కలిసి హైవే, బ్రిడ్జి ప్రాజెక్టు  పనులు వెంటనే ప్రారంభించాలని కోరారు.

అలాగే ప్రతిష్టాత్మకమైన కొల్లాపూర్ ప్రజల దశాబ్దాల కల సోమశిల వంతెన భూమిపూజకు రావాల్సిందిగా కేంద్ర మంత్రులను ఆయన ఆహ్వానించారు.

ఎల్లేని ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రులు కొల్లాపూర్ తప్పకుండా వస్తామన్నారు. కొల్లాపూర్ అభివృద్ధి కోసం ఎల్లేని పడుతున్న తపన చూసి గడ్కరీ ప్రత్యేకంగా  అభినందించడమే కాకుండా హైవే సుధాకర్ రావు అంటూ సంబోధించారు.

Related posts

సీఎం కేసీఆర్ జైలుకెళ్ల‌డం ఖాయం బండి

Sub Editor

అమృతమే

Satyam NEWS

పేపర్ ట్రబుల్: ఆదాయం లేక అగాధంలోకి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!