28.7 C
Hyderabad
April 25, 2024 06: 56 AM
Slider నెల్లూరు

ఘనంగా యునైటెడ్ ఫోరం జాతీయ అధ్యక్షుడు రవి రాఘవేంద్ర జన్మదినం

#United Forum Nellore

ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ, బీసీ,.మైనారిటీస్ యునైటెడ్ ఫోరమ్ జాతీయ అధ్యక్షుడు డేగా రవి రాఘవేంద్ర జన్మదిన వేడుకలు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఘనంగా జరిగాయి.

ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ వెంకటగిరి నియోజకవర్గ అధ్యక్షుడు పుట్ట గురు ప్రకాష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ సీనియర్ న్యాయవాది, యునైటెడ్ ఫోరం న్యాయ సలహా దారుడు లక్కమనేని కోటేశ్వరరావు హాజరై కేక్ కట్ చేశారు.

ఈ సందర్భంగా ఎల్.కె.ఆర్  మాట్లాడుతూ యునైటెడ్ ఫోరం జాతీయ అధ్యక్షుడు డేగా రవి రాఘవేంద్ర జన్మదిన వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు.

జాతీయస్థాయిలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆయన చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు.

ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని… అందుకు ఆ భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆశీర్వదించారు.

అనంతరం ఎల్ కె ఆర్ చేతులమీదుగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జోగి కోటేశ్వరరావు, మొద్దు వెంకటేశ్వర్లు అరవ రాజేష్, సభ్యులు వెంకటాద్రి, అమరేంద్ర, సంతోష్, వెంకటేశ్వర్లు, తదితర యూనిటెడ్ ఫోరం సభ్యులు పాల్గొన్నారు.

కె.రమాకాంత్, వెంకటగిరి సామాన్యుడు.

Related posts

పొంగులేటికి గ్రామీణ జిల్లాల కానిస్టేబుల్ అభ్యర్థుల వినతి

Bhavani

బ్రహ్మకుమారీస్ ప్రధాన నిర్వాహకురాలు రాజయోగిని ఇక లేరు

Satyam NEWS

మాస్టర్ ప్లాన్ పై విచారణ వాయిదా

Bhavani

Leave a Comment