“ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్” మన దేశ భిన్నత్వంలో ఏకత్వం ఓ పండుగలా జరుపుకోవడమే అని తెలంగాణ రాష్ట్ర యూత్ సర్వీసెస్ డైరెక్టర్ మొహమ్మద్ అబ్దుల్ అజీమ్ అన్నారు. నెహ్రూ యువ కేంద్ర సంఘటన్, తెలంగాణ ఆధ్వర్యంలో ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
వివిధ రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలు, అభ్యాసాల పరిజ్ఞానం పరస్పరం పంచుకోవడం వల్ల రాష్ట్రాల మధ్య మెరుగైన బంధానికి దారితీస్తుందని, తద్వారా భారతదేశ ఐక్యత, సమగ్రతను బలపడుతుదని నజీమ్ అన్నారు. పిఐబి డైరెక్టర్ జనరల్ ఎస్.వెంకటేశ్వర్ మాట్లాడుతూ హైదరాబాద్ ఓ మినీ భారత్ అని , ఇక్కడ వివిధ సంస్కృతులు, విభిన్న ఆహార అలవాట్లు ఉన్నాయన్నారు.
సంస్కృతి, పర్యాటక రంగం, భాష, విద్య, పౌరులు సాంస్కృతిక వైవిధ్యాన్ని అలవర్చుకొనే వార్షిక కార్యక్రమాలలో వివిధ రాష్ట్రాలు, జిల్లాలను అనుసంధానించడానికి ఈ కార్యక్రమం చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అన్నారు. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ద్వారా జాతీయ సమైక్యతను ప్రోత్సహించడానికి వివిధ కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.