37.2 C
Hyderabad
April 18, 2024 21: 52 PM
Slider జాతీయం

పంజాబ్ లో కొత్త మంత్రివర్గం..చన్నీ బృందంలో 15 మంది

పంజాబ్ కొత్త మంత్రులు చండీగఢ్‌లో ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. కెప్టెన్ క్యాబినెట్‌లో చేరిన బ్రహ్మ్ మొహీంద్ర, మన్‌ప్రీత్ బాదల్, ట్రిప్ట్ రజిందర్ బజ్వా, అరుణ చౌదరి, సుఖ్ సర్కారియా, రానా గుర్జిత్, రజియా సుల్తానా, విజయేంద్ర సింగ్లా, భరత్ భూషణ్ అశు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

రణ్ దీప్ నభా, రాజ్ కుమార్ వెర్కా, సంగత్ సింగ్ గిల్జియాన్, పరగత్ సింగ్, అమరీందర్ సింగ్ రాజా వడింగ్, గుర్కీరత్ కోట్లీ, మొదటిసారి మంత్రులు అవుతున్నారు. అయితే, అంతకుముందు చివరి నిమిషంలో కుల్జీత్ నాగ్రాకు మంత్రి పదవి ఇవ్వకూడదని నిర్ణయించారు. అతని స్థానంలో, అమ్లోహ్ నుండి ఎమ్మెల్యే కాకా రణ్‌దీప్ నభా మంత్రి అయ్యారు.

దోబా ప్రాంతానికి కళంక నాయకుడుగా పేరుపొందిన రానా గుర్జిత్‌ని అందరూ తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా ఆయన పేరు మంత్రి వర్గంలో చేర్చారు. దీంతో అయన కూడా ప్రమాణ స్వీకారం చేశారు. రాణా గుర్జిత్ 2017 లో కెప్టెన్ సర్కార్ మంత్రివర్గంలో ఉన్నారు. ఇసుక మైనింగ్‌లోఆయన  పాత్రపై ఆరోపణలు ఎదుర్కొన్నారు. రాహుల్ గాంధీ ఆమోదం తర్వాత, కెప్టెన్ రానా రాజీనామాను తీసుకున్నారు. ఇప్పుడు ఆయన చన్నీ ప్రభుత్వంలో మళ్లీ మంత్రి అయ్యారు. అయితే సాధు సింగ్ ధరంసోత్, బల్వీర్ సిద్ధు, రానా గుర్మీత్ సోధి, గురుప్రీత్ కంగర్, సుందర్ షామ్ అరోరాలకు కొత్త క్యాబినెట్‌లో చోటు దొరకలేదు.

Related posts

చురుకుగా సాగుతున్న స్వచ్ఛ భారత్ మిషన్

Satyam NEWS

ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు

Satyam NEWS

కలెక్టరెట్ లో క్లీన్ అండ్ గ్రీన్

Bhavani

Leave a Comment