39.2 C
Hyderabad
April 23, 2024 18: 12 PM
Slider నిజామాబాద్

వరి పంటకు వస్తున్న తెగుళ్లపై రైతుల ఆందోళన

farmers

బిచ్కుంద  మండలంలోని వాజిద్ నగర్ గ్రామంలో వరి పైరుకు ఏదో గుర్తు తెలియని చీడ తగిలి పంట ఎండి పోతుందంటూ కొందరు రైతులు వ్యవసాయ అధికారి  పోచయ్య ఎడిఎ ఆంజనేయులు దృష్టికి శనివారం  తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా ఆయన పంట తెగుళ్లను పరిశీలించి పంటలకు పంపాడు పురుగు, కంకినల్లి అగ్గి తెగులు, మొగ్గి పురుగు  ఒకేసారి ఆశించడంతో ఇలా పంటలు ఎండుతున్నాయని వివరించారు. రైతులు ఆందోళన చెందకుండా ఉండాలన్నారు. వాటికి అవసరమైన మందులను అధికారులు సూచించారు. వాటిని స్ప్రే చేస్తే పంట తెగుళ్లు నివారించవచ్చునన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు వ్యవసాయ అధికారులతో పాటు ఎంపిపి అశోక్  పటేల్, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు రాజు, సహకార సంఘం అధ్యక్షులు బాలాజీ  రైతు  సమన్వయ సమితి అధ్యక్షులు బస్వరాజ్ పటేల్, బిచ్కుందా ఉపసర్పంచ్ నాగరాజు సీనియర్ నాయకులు పాషా సెట్ ఆయా గ్రామాల సర్పంచులు తదితరులున్నారు.

Related posts

తితిదే బోర్డు సభ్యుల నియామకాలను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిల్‌

Satyam NEWS

గోల్నాకా డివిజన్ లో డ్రైనేజీ ఆధునీకరణ పనులు

Satyam NEWS

రేపు రాజ్యసభ కు హాజరు కానున్న చిదంబరం

Satyam NEWS

Leave a Comment