28.7 C
Hyderabad
April 25, 2024 03: 30 AM
Slider సంపాదకీయం

జస్టిస్ ఫర్ దిశ: ఉపేంద్రా అతితెలివి ప్రదర్శించవద్దు

Upendra

దిశకు అన్యాయం జరిగిన తర్వాత కన్నా ఆ నిందితుల ఎన్ కౌంటర్ జరిగిన తర్వాత చాలా గొంతులు లేస్తున్నాయి. మానవత్వానికి వారే ప్రతినిధులైనట్లు వారు మాట్లాడుతున్న మాటలు చూస్తే ‘పోలీసులు ఎంత అన్యాయం చేశారు’ అనిపించకమానదు.

మానవ హక్కుల సంఘాలతో బాటు సినీ ప్రముఖుడు ఒకరు దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై చేసిన కామెంటు తీవ్ర అభ్యంతరకరంగా ఉంది. ఉపేంద్ర అనే ఆ కన్నడ నటుడు లేనిపోని అనుమానాలు రేకెత్తించేలా చేసిన వ్యాఖ్యలు పోలీసు ప్రతిష్టతను పూర్తిగా మంటగలిపేవిగా ఉన్నాయి. ‘దిశ సంఘటన వెనుక ఎవరైనా పెద్దలు ఉన్నారేమో. అందుకే హడావుడిగా ఆ నలుగురిని కాల్చేశారేమో’ అంటూ ఆయన వెలిబుచ్చిన అభిప్రాయం కచ్చితంగా అభ్యంతరకరమైనదే.

 కేసును పూర్తిగా తప్పుదోవ పట్టించేది. దిశ హత్య జరిగిన తీరు లో సగం వరకూ సిసి కెమెరాలలో రికార్డయి ఉంది. ఆనవాలు పోల్చుకుంటూ నలుగురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఆ నలుగురు వ్యక్తులు ఇంటి నుంచి ఎప్పుడు వెళ్లింది, ఎప్పుడు తిరిగి వచ్చింది క్లియర్ గా ఉంది.

సంఘటన జరిగిన సమయానికి మ్యాచ్ అవుతున్నది. ఆ కుటుంబాలకు చెందిన సభ్యులు ఇచ్చిన సమాచారం కూడా సరిపోలుతున్నది. దిశ పర్సు, వాచ్ ఎక్కడ పెట్టారో కూడా నిందితులు చెప్పారు. ఇవన్నీ కాకుండా నేరం చేసినట్లు వారు అంగీకరించారు. ఇవన్నీ కోర్టులో శిక్ష పడేందుకు సరిపోవని అందుకే కాల్చి చంపారని కొత్త వాదన కూడా వినిపిస్తున్నది.

ఈ వాదన కానీ ఉపేంద్ర వెలిబుచ్చిన అభిప్రాయం కానీ పూర్తిగా తప్పు. కోర్టుకు ఇంత కన్నా సాక్ష్యాలు అవసరం లేదు. ఎవరో వేరేవారు అత్యాచారం చేశారు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ నలుగురిని ఇరికించారు అని చెప్పడం హేతుబద్దంగా లేదు.

దిశ కేసులో ఎవరూ (ఒక్క ఉపేంద్ర తప్ప) ఈ అనుమానాలు వెలిబుచ్చలేదు. దిశ తన చెల్లెలికి కాల్ చేసిన వాయిస్ కూడా రికార్డు అయి ఉంది. నాకు భయంగా ఉంది అని దిశ చెప్పిన మాటలు ప్రతి ఒక్కరి చెవుల్లో రింగుమంటున్నాయి. స్కూటీకి పంక్చర్ అయిన తర్వాత ఈ నిందితులలో ఒకడు స్కూటీని తీసుకువెళ్లడం, వాడు ఎంతకీ తిరిగి రాకపోవడంతో దిశ తన సెల్ నుంచి వాడికి కాల్ చేయడం కూడా విచారణ లో తేలింది.

దిశను ట్రక్కులో తీసుకెళుతున్నప్పుడు ఒకడు స్కూటీపై వెనుక వెళుతున్న దృశ్యాలు కూడా సిసి టివి కెమెరాలలో నిక్షిప్తమై ఉన్నాయి. ఇవన్నీ పట్టించుకునేంత తీరిక లేని సినీనటుడు తన పని తాను చేసుకోకుండా పోలీసులపై జనబాహుళ్యంలో అనుమానాలు రేకెత్తిస్తున్నాడు. ఇది క్షమించరాని తప్పు. తాను చేసిన తప్పుకు ఉపేంద్ర బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. లేకపోతే పోలీసులు అతడి పై పరువు నష్టం దావా వేయాలి.

Related posts

మహిళలను విస్మరిస్తే  అభివృద్ధి సాధించడం సాధ్యం కాదు

Murali Krishna

రేపటి నుంచి మారుతున్న తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శన వేళలు

Bhavani

మత సామరస్యంలో భారత్‌ మార్గదర్శి

Sub Editor

Leave a Comment