40.2 C
Hyderabad
April 24, 2024 16: 31 PM
Slider రంగారెడ్డి

కరోనా వ్యాధిగ్రస్తులను ఆదుకుంటున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్

#Uppla Trust

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల పరిధిలోని కొట్ర గ్రామంలో కరోనా పాజిటివ్ నమోదు వ్యాధిగ్రస్తులకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా హోమ్ ఐసోలేషన్ కిట్లు శనివారం అందచేశారు.

ఈ సందర్భంగా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తలకొండపల్లి జెడ్ పి టి సి ఉప్పల వెంకటేష్ పెద్ద కుమారుడు అఖిల్ మాట్లాడుతూ తలకొండపల్లి మండలం గట్టుపల పల్లి గ్రామంలో కరోనా పాజిటివ్ దాదాపు 10 మంది దాకా హోం ఐసోలేషన్ లో ఉంటున్న వారికి ఈ కిట్లు అందజేస్తున్నట్లు తెలిపారు.

కిట్లను ఓకే ఇంటిలో ఇద్దరు లేక ముగ్గురు కరోనా బాధితులు ఉన్న వారికి ఇండీస్ వెల్ కిట్లు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.

అదేవిధంగా ఈ వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మాస్కులు ధరించాలని స్వీయ నియంత్రణ పాటించాలని అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని నాకు ఏం కాదులే అని  ధీమాగా ఉండరాదని అదేవిధంగా జలుబు, దగ్గు, జ్వరం , ఒళ్ళు నొప్పులు, విరేచనాలు ఉన్న నిర్లక్ష్యం వహించకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపారు.

తగిన జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల వెంకటేష్ మిత్రమండలి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

శ్రీ యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి సేవలో సోమేష్ కుమార్

Satyam NEWS

ముగిసిన శ్రీ సుందరరాజస్వామివారి అవ‌తారోత్స‌వాలు

Satyam NEWS

ఘనంగా కార్తీక మాసం ముగింపు వేడుకలు

Satyam NEWS

Leave a Comment