కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు విదేశాల నుంచి వచ్చే యూరియాను కేటాయించినందు వల్లే సరఫరాలో జాప్యం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 8 లక్షల నుండి 8.5 లక్ష ల యూరియా కావాలని కేంద్రాన్ని కోరిందని అయితే బీహార్ ఇతర రాష్ట్రాలలో వర్షాలు ఎక్కువగా ఉన్నందున యూరియా సరఫరాలో జాప్యం జరిగిందని మంత్రి వివరించారు. 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇప్పటి వరకు సరఫరా చేశామని ఆయన తెలిపారు. యూరియా దొరకడం లేదనే పుకార్ల వల్ల ఒకటి కావాల్సిన వారు రెండు కొనడంతో కృత్రిమ కొరత ఏర్పడిందని ఆయన వివరించారు. యూరియా సరఫరాపై రాజకీయ నాయకులు అనవసర ఆరోపణలు చేయాల్సిన అవసరం లేదని, రైతన్నలను ఆగం చేయవద్దు అని మంత్రి కోరారు. రాష్ట్రంలో యూరియా సమస్య లేదని అవసరం ఉంటే ప్రతిపక్ష పార్టీల నేతలను పిలిచి మాట్లాడుతామని మంత్రి తెలిపారు. యూరియా ను బ్లాక్ చెయ్యడం సాధ్యం కాదని, ఇతర దేశాల నుండి రావాల్సిన యూరియా లెట్ గా రావడమే అస్సలు కారణం అని మంత్రి తెలిపారు. రైతు బంధు ప్రవేశపెట్టే ముందు ఉచిత ఎరువులు ఇస్తాం అని ఆలోచన ఉండే అని మాత్రమే కేసీఆర్ చెప్పారని మంత్రి వివరించారు.
previous post
next post