భారతీయ విద్యార్థిని జాహ్నవి కందులను కారుతో ఢీ కొట్టి చంపిన అమెరికన్ పోలీసు అధికారిని విధుల నుంచి తప్పించారు. 2023 జనవరిలో భారతీయ విద్యార్థిని జాహ్నవి కందులను సియాటిల్ పోలీసు అధికారి కెవిన్ డేవ్ విపరీతమైన స్పీడుతో వచ్చి వాహనంతో ఢీ కొట్టాడు. వేగంగా వస్తున్న పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొనడంతో కందుల 100 అడుగుల అవతల కిందపడిపోయింది. ఈ ఘటనపై విచారణ ముగియడంతో సీటెల్ పోలీస్ డిపార్ట్‌మెంట్ నుండి డేవ్‌ను తొలగించినట్లు తాత్కాలిక సీటెల్ పోలీస్ చీఫ్ సూ రాహ్ర్ తెలిపారు.
రాహ్ర్ ఈ మేరకు వివరాలు వెల్లడిస్తూ ఒక డ్రగ్స్ కేసు పరిశోధన నిమిత్తం అతను వెళుతున్నట్లు రుజువు అయిందని, అయితే విపరీతమైన స్పీడుతో వాహనం నడపడం మాత్రం అనుమతించలేమని తెలిపారు. వీలైనంత త్వరగా డ్రగ్స్ బాధితుడి వద్దకు వెళ్లేందుకు అతను ప్రయత్నం చేసినా స్పీడుగా వాహనం నడపడం, ఒక యువతి మరణానికి కారణం కావడాన్ని మాత్రం తాను ఆమోదించలేదని వెల్లడించారు.