30.7 C
Hyderabad
April 24, 2024 01: 46 AM
Slider ప్రపంచం

వచ్చే వారం భారత్ రానున్న అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి

#USDefanceSecretary

భారత్ ను తమ అతిపెద్ద రక్షణ భాగస్వామిగా ప్రకటించిన అమెరికా తదుపరి చర్యలకు ఉపక్రమించింది. రక్షణ రంగానికి సంబంధించి మరిన్న నూతన ఒప్పందాలు చేసుకోవడానికి అమెరికా సిద్ధపడుతున్నది.

ఇందులో భాగంగా అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి లాయడ్ ఆస్టిన్ త్వరలో భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ కాబోతున్నారు.

గత కొద్ది సంవత్సరాలుగా భారత్ అమెరికా మధ్య అనేక రక్షణ సంబంధ ఒప్పందాలు జరిగాయి.

2016లో రెండు దేశాల మధ్య లాజిస్టిక్స్ ఎక్సేంజ్ మెమోరాండం అగ్రిమెంట్ పై సంతకాలు జరిగిన నాటి నుంచి రక్షణ వ్యవహారాల భాగస్వామ్యం మొదలైంది.

ఇరు దేశాల భూభాగంలో తమ యుద్ధ విమానాలు, టాంకుల ఇంధనం నింపుకోవడం నుంచి మరమ్మతులు చేసుకునే విధంగా ఈ ఒప్పందం కుదిరింది.

అమెరికా రక్షణ కార్యదర్శి భారత్ కు రావడం ఇదే ప్రధమం. జపాన్, దక్షిణ కొరియా లను సందర్శించిన తర్వాత ఆస్టిన్ భారత్ కు వస్తారు.

వచ్చే వారం ఆయన పర్యటన ఉండవచ్చునని పెంటగాన్ వర్గాలు సూచన ప్రాయంగా తెలిపాయి.

సరిహద్దు భద్రత తదితర అంశాలపై సమాచార భాగస్వామ్యం నుంచి ఇతర రక్షణ రంగ ఒప్పందాలపై ఆయన పర్యటనలో మరింత ముందడుగు పడే అవకాశం ఉంది.

Related posts

తెలంగాణ లోని అత్యంత వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలి

Satyam NEWS

గృహ సారథులను, కన్వీనర్లను రద్దు చేయాలి

Satyam NEWS

లేబర్ కోడ్ రద్దు కోరుతూ రాజంపేట లో సి.ఐ.టి.యు.నిరసన

Satyam NEWS

Leave a Comment