35.2 C
Hyderabad
April 24, 2024 14: 43 PM
Slider ప్రపంచం ముఖ్యంశాలు

భర్త భార్య మధ్యలో ఇరుక్కున్న మాజీ ప్రియుడు

kevin

పెళ్లాం పోతే పోయింది కానీ ఏడున్నర లక్షల డాలర్లు సంపాదించాడు ఒక పెద్దమనిషి. నిజంగా ఇది నిజం. వాషిగ్టన్ కు చెందిన కెవిన్ హోవర్డ్ కేవలం ఆఫీసు పనితోనే బిజీగా ఉండటం తనను పట్టించుకోకపోవడం, తనతో సమయం గడపకపోవడంలో అతని భార్య అతనితో ఉన్న 12 ఏళ్ల వివాహ బంధాన్ని పుటుక్కున తుంచేసింది. దాంతో మనోడికి తలతిరిగిపోయింది. తన తో వివాహ బంధం కట్ చేసుకున్న తన భార్య తనతో పని చేసే మరొక వ్యక్తిని పెళ్లాడింది. తన భార్య ప్రియుడు, అదే కొత్త మొగుడు, చాలా సార్లు కెవిన్ ఇంటికి వచ్చేవాడట. రెండు మూడు సార్లు ముగ్గురూ కలిసి డిన్నర్ కూడా చేసి కష్టసుఖాలు కలబోసుకున్నారట. తన భార్య తనకు విడాకులు ఇచ్చిన తర్వాత కెవిన్ ఊరుకోలేదు. ఆమె పై ఒక నిఘా సంస్థను నియమించాడు. వారు ఎంతో కష్టపడి పరిశోధించి కెవిన్ మాజీ భార్యకు, ఆమె తాజా భర్తకు వీరిద్దరూ వివాహ బంధంలో ఉన్నప్పటి నుంచి వివాహేతర సంబంధం ఉందట. ఈ విషయం తెలియగానే కెవిన్ తన బుర్రకు పదును పెట్టాడు. చాలా కాలం కిందట అమెరికాలో ఒక చట్టం ఉండేది. అది ఎలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ చట్టం. ఈ చట్టం చాలా కాలం కిందటే అమెరికాలోని చాలా రాష్ట్రాలలో రద్దు అయిపోయింది. అయితే హవాయి, మిసిసిపి, న్యూ మెక్సికో, సౌత్ డకోటా, ఉటా రాష్ట్రాలలో మాత్రం ఈ చట్టం రద్దు కాలేదు. ఎలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ చట్టం ఏమని నిర్దేశిస్తుందంటే తమ వివాహం చట్టుబండలు కావడానికి ఎవరైతే కారణమో వారిపై దావా వేసి పరిహారం కోరవచ్చు. ఇంకే కెవిన్ ఈ చట్టం ప్రకారం తన భార్య తాజా భర్తపై దావా వేశాడు. ఆ ప్రయివేటు డిటెక్టీవ్ ఏజెన్సీవారు తమ పరిశోధన వివరాలను జడ్జికి అంద చేశారు. దాంతో ఆమె తాజా భర్తకు ఏడున్నర లక్షల డాలర్ల పరిహారం విధించారు. అదీ సంగతి

Related posts

క్రీడాకారులకు అండగా తెలంగాణ ప్రభుత్వం

Satyam NEWS

కరోనా బాధితులకు ఆహారం అందించిన మున్నూరు కాపులు

Satyam NEWS

గురుకుల పాఠశాల తరలింపు అన్యాయం

Satyam NEWS

Leave a Comment