33.2 C
Hyderabad
April 26, 2024 00: 44 AM
Slider ప్రపంచం

ఫైజర్ వ్యాక్సిన్ తీసుకుని స్పృహతప్పి పడిపోయిన నర్సు

USNurse

కరోనా సోకకుండా నిరోధించేందుకు ప్రఖ్యాత ఫైజర్ కంపెనీ రూపొందించిన వ్యాక్సిన్ తీసుకున్న ఒక నర్సు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడం సంచలనం కలిగిస్తున్నది.

ఫైజర్ కంపెనీ రూపొందించిన బయోఎన్ టెక్ కరోనా వ్యాక్సిన్ ను అమెరికాలో ముందుగా ఆరోగ్య సిబ్బందికి వేస్తున్నారు.

ఈ క్రమంలోనే అమెరికాలోని టెన్నిస్సీ లోని చెట్టనూగా ఆసుపత్రిలో కూడా ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఇదంతా లైవ్ టీవీ ప్రోగ్రామ్ లోనే జరిగింది.

తాను తన సిబ్బంది అందరూ కరోనా వ్యాక్సిన్ పొందడం అదృష్టం అని నర్సు టిఫ్నీ డోవర్ చెబుతూ ఉన్నది. అలా చెబుతూ చెబుతూ తనకు తల నొప్పిగా ఉందని అన్నది.

ఈ మాట చెబుతూనే ఆమె స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే పక్కనే ఉన్న డాక్టర్లు ఆమెను నేలపై పడుకోబెట్టి అత్యవసర చికిత్స అందచేశారు.

ఆ తర్వాత ఆమె ఒక ప్రముఖ వార్తా సంస్థతో మాట్లాడుతూ తనకు తల నొప్పి వచ్చినప్పుడు ఇలా స్పృహ తప్పి పడిపోతానని చెప్పింది.

ఏది ఏమైనా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వెంటనే స్పృహ తప్పి పడిపోవడంతో ఫైజర్ వ్యాక్సిన్ పై అనుమాన మేఘాలు కమ్ముకుంటున్నాయి.

Related posts

హైదరాబాద్ లో జోరుగా సాగుతున్న డ్రగ్స్ దందా

Satyam NEWS

ఆసుపత్రి నుంచి ఐదు రోజుల పసికందు మాయం

Satyam NEWS

ప్రభుత్వానికే ‘ఆక్సిజన్’ అందిస్తున్న సోనూసూద్

Satyam NEWS

Leave a Comment