34.2 C
Hyderabad
April 19, 2024 19: 16 PM
Slider ప్రపంచం

అమెరికా దగ్గర భారీగా అణుబాంబులు తొలిసారి వెల్లడి

అమెరికా సంచలన అడుగు వేసింది. అమెరికా ప్ర‌భుత్వం తమ దగ్గరున్న అణు బాంబుల సంఖ్య‌ను అధికారికంగా వెల్ల‌డించింది. అణ్వాయుధాలకు వ్యతిరేకంగా జరిపే పోరులో పారద్శకతకే బాంబుల లెక్కలు చెబుతున్నామని తెలిపింది.

గడిచిన నాలుగేళ్లలో అగ్రరాజ్యం తన దగ్గరున్న ఆటం బాబుల సంఖ్య‌ను ప్ర‌క‌టించ‌డం ఇదే తొలిసారి. డొనాల్డ్ ట్రంప్ హయాంలో అణ్వాయుధాల డేటా వెల్లడిపై ఆంక్షలు కొనసాగగా, జోబైడెన్ ఎన్నికైన తర్వాత సదరు ఆంక్షల్ని తొలగించి, పారద్శకతను ప్రదర్శిస్తున్నారు.

గ‌తేడాది సెప్టెంబ‌ర్ 30 నాటికి అమెరికా వ‌ద్ద మొత్తం 3,750 అణ్వాయుధాలు ఉన్న‌ట్లు ఫెడరల్ ప్రభుత్వం వెల్లడించింది. చివరిసారిగా 2019తో బయటపెట్టిన లెక్కతో పోలిస్తే అణ్వాయుధాల సంఖ్య 55 త‌క్కువేనని, 2017తో పోల్చితే 72 వెపన్స్ పెరిగాయని పేర్కొంది.

Related posts

గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె 4 వ రోజు కొనసాగింపు

Satyam NEWS

తల్లిదండ్రుల్ని రోడ్డుపైకి నెట్టేసిన కసాయి కొడుకు

Satyam NEWS

రాజ్ దాసిరెడ్డికి డబుల్ ధమాకా!!

Satyam NEWS

Leave a Comment