30.7 C
Hyderabad
April 19, 2024 09: 40 AM
Slider ప్రపంచం

భారత్ లో ఉండటం క్షేమం కాదు వెంటనే వచ్చేయండి

#traveladviosory

భారత్ లో కరోనా విజృంభణ అత్యంత తీవ్రంగా ఉన్నందున అమెరికా పౌరులు తక్షణమే తిరిగి వచ్చేయాలని అమెరికా ఆదేశాలు జారీ చేసింది.

అరుదుగా విడుదల చేసే నాలుగవ స్థాయి ప్రమాద హెచ్చరికను అమెరికా నేడు విడుదల చేసింది.

భారత్ లో కరోనా అదుపు తప్పిందని, అక్కడ ఆరోగ్య సౌకర్యాలు కూడా లేవని అందువల్ల అమెరికా పౌరులు తక్షణమే తిరిగి వచ్చేయాలని అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ ట్రావెల్ ఎడ్వయిజరీ విడుదల చేసింది.

భారత్‌లో కరోనా కారణంగా నెలకొన్న విపత్కర పరిస్థితుల దృష్ట్యా అనారోగ్యానికి గురైతే వైద్యం పొందడం అంత సులువు కాదు అని పేర్కొంది.

అందుబాటులో ఉన్న రోజువారీ డైరెక్ట్ విమానాల ద్వారా యూఎస్ చేరుకోవాలని సూచించింది.

నేరుగా విమాన సర్వీసులు అందుబాటులో లేనిపక్షంలో వయా పారిస్, ఫ్రాంక్‌ఫర్ట్ ద్వారా స్వదేశానికి చేరుకోవాలని తెలిపింది.

అలాగే అమెరికా నుంచి భారత్‌కు ఎవరూ ప్రయాణాలు పెట్టుకోవద్దని హెచ్చరించింది.

Related posts

బిచ్చం వేసి ఆర్టీసీని ఆదుకోండి ప్లీజ్

Satyam NEWS

పట్టణ కేంద్రాల్లో ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించాలి

Satyam NEWS

భోగాపురం ఆర్అండ్ఆర్‌ కాల‌నీలో అన్ని స‌దుపాయాలు

Satyam NEWS

Leave a Comment