మహిళా సంఘాల సభ్యులు సమష్టిగా చర్చించుకొని ప్రభుత్వం మహిళా సాధికారతకు అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కోరారు. ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా శాసన సభ్యుడు తూడి మేఘా రెడ్డితో కలిసి నాచహల్లి గ్రామంలో మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభోత్సవం చేశారు. గ్రామంలో మహిళా సమాఖ్య భవనం కొత్త నిర్మించి వదిలేసి సంవత్సరాలు గడిచిపోయిన స్థానిక శాసన సభ్యుడు 5 లక్షలు మంజూరు చేసి పూర్తి చేయడంతో శనివారం ప్రారంభోత్సవం చేశారు.
శాసన సభ్యుడు తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తుందన్నారు. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ళు, మహిళలకు 2500 రూపాయలు, కొత్త రేషన్ కార్డులు మంజూరు వంటివి అమలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ కార్యనిర్వాహక ఇంజనీరు మల్లయ్య, మాజీ ఎంపిపి కిచ్చారెడ్డి, మాజీ జడ్పీటీసీ వెంకటయ్య, మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్