30.2 C
Hyderabad
October 13, 2024 17: 04 PM
Slider జాతీయం

వ‌ర‌ద బుర‌ద శుభ్రం చేయ‌డానికి ఫైరింజ‌న్ల ఉప‌యోగం భేష్‌

#fireengine

అమ‌రావ‌తి – వ‌ర‌ద ముంపు ప్రాంతాల్లో వీధులు, కాల‌నీలు, ఇళ్ల‌లో వ‌చ్చిప‌డ్డ బుర‌ద‌ను శుబ్రం చేయ‌డానికి ఫైరింజ‌న్లు ఉప‌యోగించాల‌నే ఆలోచ‌న రాష్ట్ర ప్ర‌భుత్వానికి రావ‌డం అద్భుత‌మ‌ని కేంద్ర వైద్య బృందం ప్ర‌శంసించింది. వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో గ‌త కొన్ని రోజులుగా కేంద్ర ప్ర‌భుత్వం పంపిన వైద్య బృందం ప‌ర్య‌టిస్తోంది. కేంద్ర ప్ర‌భుత్వంలో వివిధ వైద్య ఆరోగ్య విభాగాల్లో నిష్ణాతులైన ఆరు మంది ప్ర‌త్యేక వైద్యుల బృందం వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించింది.

అక్క‌డ రాష్ట్ర ప్ర‌భుత్వం వ్యాధులు ప్ర‌బ‌ల‌కుండా చేప‌డుతున్న చ‌ర్య‌లు,  హెల్త్ వ‌ర్క‌ర్ల ఆరోగ్య సంర‌క్ష‌ణ‌కు, ప్ర‌జారోగ్య ప‌రిర‌క్ష‌ణ‌కు అవ‌లంభిస్తున్న ప‌ద్ద‌తుల‌ను క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించింది. అనంత‌రం స‌చివాల‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వ ఆరోగ్య శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం.టి. కృష్ణ‌బాబుతో భేటీ అయింది. ఈ సంద‌ర్భంగా కేంద్ర వైద్య బృందంలోని వైద్య‌లు తాము క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించిన అంశాల గురించి ప్ర‌భుత్వం దృష్టికి తీసుకొచ్చారు. వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్ర‌భుత్వం, ఆరోగ్య‌శాఖ చేప‌డుతున్న చ‌ర్య‌లు, అవ‌లంభిస్తున్న‌విధానాలు సంతృప్తిక‌రంగా ఉన్నాయ‌ని చెప్పింది.

వ‌ద‌ర ప్ర‌భావిత ప్రాంతాల్లో బుర‌ద‌లో కూరుకుపోయిన ప్రాంతాల‌ను ఫైరింజ‌న్లు ఉప‌యోగించి యుద్ధ ప్రాతిప‌దిక‌న శుభ్రం చేయ‌డం చూసి కేంద్ర బృందం ఆశ్చ‌ర్య‌పోయింది. ఇది ఒక వినూత్న‌మైన అద్భుత‌మైన ఆలోచ‌న అని రాష్ట్ర ప్ర‌భుత్వాన్నిప్ర‌శంసించింది.  వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో అంటు రోగాలు ప్ర‌బ‌ల‌కుండా ప్ర‌స్తుతం చేప‌డుతున్న ప‌ద్ద‌త‌కుకు అద‌నంగా మ‌రికొన్ని ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేంద్ర వైద్య బృందం సూచించింది.

ఈ బృందంలో నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోలో సంస్థ‌లో ఎంట‌మాల‌జీ విభాగ జాయింట్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ ర‌మేష్ చంద్ర‌, మంగ‌ళ‌గిరిలోని ఎయిమ్స్ ఆసుప‌త్రి  వైద్యులు డాక్ట‌ర్ రామ‌కృష్ణ,  డాక్ట‌ర్ ఎం.రాజేంద్రప్ర‌సాద్‌, డాక్ర్ స్మితా సింఘాల్‌, డాక్ట‌ర్ స‌త్య‌నారాయ‌ణ‌న్, హైద‌రాబాద్‌కు చెందిన డాక్ట‌ర్ వ‌రుణ్ వి.గైకీలున్నారు.

Related posts

ప్రజల సహకారంతోనే నేరాల నియంత్రణ

Murali Krishna

మద్నూర్ దక్షిణ ముఖ ఆంజజేయుడికి రికార్డు స్థాయి ఆదాయం

Satyam NEWS

How to Buy XRP in 2023 With PayPal or Credit Card

Bhavani

Leave a Comment