39.2 C
Hyderabad
March 28, 2024 15: 28 PM
Slider ఖమ్మం

పెండింగ్‌ చలాన్ రాయితీలను వినియోగించుకోవాలి

utilize pending challan concessions

పెండింగ్‌ చలాన్లకు సంబంధించి జరిమానా చెల్లించేందుకు ప్రభుత్వం ప్రకటించిన రాయితీని  ప్రజలు వినియోగించుకోవాలని ఖమ్మం  పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి నెల చివరి  వరకు ఆన్‌లైన్ లో పెండింగ్ ఉన్న ట్రాఫిక్ చలాన్ లపై రాయితీ ఇస్తున్న నేపథ్యంలో వెబ్‌సైట్‌ https://echallan.tspolice.gov.in/publicview లో చెల్లించేందుకు అవకాశం కూడా అందించినట్లు పేర్కొన్నారు. పేటీంఏం, గూగుల్ పే వంటి వాటిని  ఉపయోగించి కూడా పెండింగ్ చలాన్‌లను క్లియర్ చేసుకోవచ్చని తెలిపారు. కొవిడ్ కారణంగా ప్రజల ఆర్థిక ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని  ద్విచక్రవాహనాలు, ఆటోలకు 75 శాతం, ఆర్టీసీ బస్సులకు 70 శాతం, కార్లు, భారీ వాహనాలకు 50 శాతం చొప్పున ప్రభుత్వం కలిపించిన రాయితీలను చెల్లించేందుకు వాహనదారులు ముందుకు రావాలన్నారు. వాహనదారులు ఈ నెల చివరి వరకు చలానాలు కట్టకపోతే తదుపరి  స్పెషల్ డ్రైవ్‌లు పెట్టి  నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని సూచించారు.

Related posts

షిర్డీ సహా అన్ని గ్రామాలలో కొనసాగుతున్న బంద్

Satyam NEWS

యునెస్కో గుర్తింపుపై ములుగు బిజెపి సంబురాలు

Satyam NEWS

భౌతిక దూరం బహు కష్టమాయేనే

Satyam NEWS

Leave a Comment