Slider ప్రత్యేకం

15 కోట్ల రూపాయల రోడ్డు వేసిన ఆరు నెలలకే బొందలమయం

anjaneyulu goud

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుండి అదిలాబాద్ వరకు గల ప్రధాన రహదారిపై జైనురు టు కిరామేరి రోడ్డు ఆరు నెలలు కూడ గడవకముందే రోడ్లు పూర్తిగా బొందల మయంగా చెరువును తలపించే విధంగా తయారయిందని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కేసరి ఆంజనేయులు గౌడ్ అన్నారు ఉట్నూరు. కేరమేరి గాట్ సెక్షన్ వరకు 27 కిలోమీటర్ల రోడ్డుకు మరమ్మత్తుల గాను 15 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించిందని కానీ ఎక్కడ కూడా రోడ్డు నాణ్యత ప్రమాణాలు అధికారుల పర్యవేక్షణ లోపం. కాంట్రాక్టర్లతో అధికారులకు మక్కు కావడంతో నాసీ రకంగా రోడ్డు వేయడంతో ఆరు నెలలు గడవకముందే రోడ్డు పూర్తిగా చెడిపోయి ప్రజలు. వాహనదారుల వెహికల్స్ దెబ్బతింటున్నాయి. ప్రయాణికులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు ప్రభుత్వం అభివృద్ధి కోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న R&B అధికారుల పర్యవేక్షణ లోపం కాంట్రాక్టర్లతో కుమ్మక్కై రోడ్డు నాణ్యతను పట్టించుకోకపోవడంతో ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలు వెచ్చించి నా మట్టిలో పోసిన చందంగా తయారైందని అన్నారు అధికారులు ఇప్పటికైనా స్పందించి రోడ్డును బాగు చేసి ప్రజలు ప్రయాణికులు ప్రమాదాలకు గురి కాకుండా కాపాడాలని లేనిపక్షంలో బిజెపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు

Related posts

రవిప్రకాష్ కు దీపం ఉగాది పురస్కారం

Satyam NEWS

ప్లానింగ్: హామీల అమలుపై అధికారులతో కేజ్రీ

Satyam NEWS

అత్యాచార కేసులకు ప్రత్యేక కోర్టు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!