28.7 C
Hyderabad
April 24, 2024 04: 45 AM
Slider ముఖ్యంశాలు

గాంధీభవన్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన ఉత్తమ్

#Uttamkumar Reddy

నిజాం పాలించిన హైదరాబాద్ రాష్ట్రం 17 సెప్టెంబర్ 1948 న భారతదేశంలో విలీనం జరిగిన సందర్భంగా గాంధీ భవన్ లో నిర్వహించిన తెలంగాణ విలీన దినోత్సవంలో పిసిసి అధ్యక్షుడు ఎంపి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు.

ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ హైదరాబాదీ ఇండియన్ యూనియన్‌లో విలీనం కోసం పోరాటంలో కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు మాత్రమే పాత్ర పోషించాయని, బిజెపి నిజాంకు వ్యతిరేకంగా పోరాటంలో పాల్గొన లేదని  అన్నారు. 1948 నుండి కాంగ్రెస్ పార్టీ ప్రతి సంవత్సరం విలీన దినోత్సవాన్ని జరుపుకుంటుందని గుర్తు చేశారు.

గాంధీ భవన్లో జరిగిన ఈ వేడుకల్లో సిఎల్పి నాయకుడు భట్టి విక్రమార్క, సీనియర్ నాయకుడు  ఎంఎల్‌సి జీవన్ రెడ్డి, వి.హనుమంతరావు, మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, ఎన్‌డిఎంఎ వైస్ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి,

వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్, పిసిసి స్పోక్స్ పర్సన్ జి.నిరంజన్, విఖరాబాద్, డిసిసి ప్రెసిడెంట్ రామ్మోహన్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

గిరిజనులు గోడు పై పోలీసు బాస్ సీరియస్…

Satyam NEWS

ఆయారాం:మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కేతనం: రేవంత్

Satyam NEWS

మట్టపల్లిలో తొలి ఏకాదశికి భక్తులకు అనుమతి లేదు

Satyam NEWS

Leave a Comment