31.2 C
Hyderabad
April 19, 2024 06: 52 AM
Slider మెదక్

ఉత్తమ్ కుమార్ రెడ్డి మహిళకు క్షమాపణ చెప్పాలి

#MinisterHarishRao

మహిళలను కించపరుస్తూ మాట్లాడటం పిసిసి అధ్యక్షుడు  ఉత్తమ్ కుమార్ రెడ్డి కి సమంజసం కాదని మంత్రి హరీష్ రావు అన్నారు. దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో రెడ్డి సంఘం భవన్ లో దుబ్బాక ఆటో యూనియన్ ఆధ్వర్యంలో టి ఆర్ ఎస్ కు సంఘీభావ సభ కార్యక్రమంలో నేడు ఆయన పాల్గొన్నారు.

తెలంగాణ మొత్తం ఇప్పుడు దుబ్బాక వైపు చూస్తున్నదని ఆయన అన్నారు. దుబ్బాక వైపు ఎప్పుడు కనిపించని మనుషులు, నాయకులు  ఈరోజు కనిపిస్తున్నారన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, నేను, కాబోయే ఎమ్మెల్యే  సుజాత అక్క ఎన్నికలు అయిపోయాక కూడా ప్రజల వైపు ఉంటాము అని హరీష్ రావు అన్నారు.

సుజాతక్కకు ధైర్యం లేదు సుజాత ఒక స్త్రీ అంటు అనడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.

భర్త చనిపోయిన పుట్టెడు దుఃఖం తో ఉన్న సుజాత కు తో బుట్టల ఉంటా.. సోదరునిలా సహకరిస్తా అని అని నేను అంటే… ఆమె అసమర్థురాలు అనే మాట అనడం మహిళల పట్ల ఉన్నా గౌరవం ఇదేనా ఉత్తమ్ కుమార్ అని ఆయన ప్రశ్నించారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Related posts

తెలంగాణ ఉద్యమ నేత పిడమర్తి రవికి MLC ఇవ్వాలి

Satyam NEWS

మ‌న సంస్కృతి, సంప్ర‌దాయాల‌ను కాపాడాలి

Satyam NEWS

మానవత్వంతో స్పందించిన పోలీసులకు అభినందనలు

Satyam NEWS

Leave a Comment