32.7 C
Hyderabad
March 29, 2024 12: 01 PM
Slider నల్గొండ

హుజూర్ నగర్ రాజీవ్ మోడల్ కాలనీని సందర్శించిన ఉత్తమ్

#uttam

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ ఫణిగిరి సీతారామచంద్ర స్వామి గట్టు వద్ద అసంపూర్ణ నిర్మాణంలో ఉన్న మోడల్ కాలనీని శుక్రవారం నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు,మాజీ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు.

రాజీవ్ గృహాలను డంపింగ్ యార్డుగా మార్చిన ప్రభుత్వంపై తీవ్రంగా మండి పడ్డారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఏడు సంవత్సరాల క్రితం తాను గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నిరుపేదల కొరకు 2000 ల మందికి ఇండ్లు నిర్మించాలని దేవాదాయ శాఖ నుండి భూములు కొనుగోలు చేసి ఇండ్లను  నిర్మాణం చేపట్టేందుకు శ్రీ కారం చుట్టామని అన్నారు.2.50 కోట్ల రూపాయలతో కాలనీ వరకు రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగిందని,80 శాతం వరకు ఇండ్ల నిర్మాణం పూర్తి చేశానని,రాష్ట్ర విభజనలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇండ్ల నిర్మాణం ఆగిపోయిందని అన్నారు.

నిర్మాణ స్థలాన్ని డంపింగ్ యార్డ్ గా మార్చారు

డబల్ బెడ్రూం ఇండ్లు ఇస్తా అని మాయ మాటలు చెప్పిన తెలంగాణ ప్రభుత్వం ఇండ్ల నిర్మాణం చేపట్టకుండా డంపింగ్ యార్డుగా మార్చారని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.మంత్రి జగదీశ్వర్ రెడ్డి పలుమార్లు పర్యటించి, 40 కోట్లు కేటాయించామని చెప్పిన మంత్రి ఎక్కడ అని ఉత్తమ్ ప్రశ్నించారు.

ఎం.ఎల్.ఏ సైదిరెడ్డి తన ఇంటి నిర్మాణం మాత్రం చేసుకున్నారని,మరి పేదల ఇండ్లు ఎందుకు పూర్తి చేయలేదని అన్నారు.ప్రజలు ఇది గ్రహించాలని గుర్తు చేశారు. నాటి కలెక్టర్ సురేంద్ర మోహన్ పలు మార్లు ఈ ఇండ్ల నిర్మాణం పూర్తి చేయుటకు నివేదికలు సమర్పించినా  పట్టించుకోక పోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువుటద్దం అన్నారు.

ఎం.ఎల్.ఏ సైదిరెడ్డి ఏవేవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడని, ముఖ్యమంత్రి,మంత్రులతో మాట్లాడి ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి నిరుపేదలకు పంచాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు.

నల్గొండ పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రజలందరికీ,జర్నలిస్ట్ కుటుంబాలకు నూతన సంవత్సరం,సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక శుభాకంక్షాలు తెలియజేశారు. అనంతరం శ్రీ వేణుగోపాల సీతా రామచంద్ర స్వామి ఆలయాన్ని ఉత్తమ్ సందర్శించారు.ఆలయ అర్చకులు, అధికారులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికి ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రాబోయేది కాంగ్రెస్ పాలనే

ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ ఏడేండ్ల క్రితం ఆలయం తరుపున 18 కోట్లు ఫిక్సడ్ డిపాజిట్ చేయడం వలన నేడు ఆలయానికి 5 నుండి 6 లక్షల రూపాయల ఆదాయం వస్తోందని గుర్తు చేశారు.రాష్ట్రంలో, కేంద్రంలో రాబోయేది కాంగ్రేస్ పార్టీ అని ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి తప్పక చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సాముల శివారెడ్డి,పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున రావు,ఐ ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్, పిసిసి రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎం.డి.అజీజ్ పాషా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరుణ్ కుమార్ దేశ్ ముఖ్, బాచిమంచి గిరిబాబు, మంజునాయక్, మేళ్ళచెరువు ముక్కంటి, జక్కుల మల్లయ్య, మున్సిపాలిటీ కౌన్సిలర్ కస్తాల శ్రవణ్ కుమార్, కోతి సంపత్ రెడ్డి,కోళ్ళపూడి యొహాన్, దొంతగాని జగన్,షేక్.సైదా, లచ్చిమల్ల నాగేశ్వరరావు,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

ఏపిలో ముస్లింలకు రంజాన్ వెసులుబాటు

Satyam NEWS

తుంగభద్రలో పుణ్య‌స్నానం ఆచ‌రించిన మంత్రులు

Satyam NEWS

పలు భాషల్లో వరుస సినిమాలతో విలక్షణ నటుడు జేడీ చక్రవర్తి బిజీ

Satyam NEWS

Leave a Comment