32.2 C
Hyderabad
March 28, 2024 23: 07 PM
Slider క్రీడలు

ఉత్తరాంధ్ర మహిళల కబడ్డీ పోటీలు.. ఉత్సవాల నేపథ్యంలో…

#uttarandhra

ఈ నెల 9,10,11,తేదీలలో విజయనగరం ఉత్సవాలు, పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా ఉత్తరాంధ్ర మహిళల కబడ్డీ పోటీ లు నిర్వహిస్తున్నట్లు విజయనగరం జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈశ్వర్ కౌశిక్ తెలిపారు.

విజయనగరం…. విజయనగరం ఉత్సవాలు, పైడితల్లి అమ్మవారి జాతరను పురస్కరించుకుని ఒకరోజు పురుషులు మరియు మహిళల ఉత్తరాంధ్రాస్థాయి కబడ్డీ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు జి ఈశ్వర్ కౌశిక్ తెలిపారు. కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులు  తో కలిసి ఆయన మీడియా తో మాట్లాడారు. కరోనా మహమ్మారి నుంచి బయటపడిన తర్వాత ఈ సంవత్సరం  రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, జిల్లా అధికారుల  నేతృత్వంలో విజయనగరం ఉత్సవాలు, పైడితల్లి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించునన్నారని తెలిపారు.

ఈ నేపథ్యంలో  క్రీడాకారులకు  క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు తమ అసోసియేషన్ కృషి చేస్తోందని అన్నారు. ఉత్తరాంధ్ర స్థాయిలో జరిగే పోటీలు ఈనెల 10వ తేదీన ఉదయం ఎనిమిది గంటల 30 నిమిషాలకు రాజీవ్ స్టేడియంలో కబడ్డీ పోటీలు ప్రారంభమవుతాయని అన్నారు. మొత్తం 15 టీములు పాల్గొనే ఈ పోటీలు ఉదయం ప్రారంభమై రాత్రి వరకు కొనసాగుతాయన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా విజేతలకు నగదు ప్రోత్సాహకాలు కూడా అందించనున్నామని తెలిపారు.

పురుషులలో ప్రధమ విజేత జట్టుకు 20వేల రూపాయలు, ద్వితీయ జట్టుకు 15 వేల , తృతీయ  జట్టుకు పదివేల , నాలుగోవ విజేత జట్టుకు 5000 నగదు అందివ్వనున్నామని తెలిపారు. మహిళల ప్రధమ విజేత జట్టుకు 6000 రూపాయలు, ద్వితీయ విజేత జట్టుకు 4000 , తృతీయ విజేత జట్టుకు 2000 , నాలుగవ విజేత జట్టుకు వెయ్యి రూపాయలు ప్రోత్సాహం అందివ్వనున్నామని తెలిపారు. మొత్తంగా 65 వేల రూపాయలు విజేతలకు ప్రోత్సాహకాలు అందివ్వనున్నామని అన్నారు.

విజయనగరం జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు నేతృత్వంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. విలేకరుల సమావేశంలో అసోసియేషన్ కార్యదర్శి కాళ్ళ సూరిబాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పి శ్రీనివాసరావు, స్కూల్స్ గేమ్స్  ఫెడరేషన్ కార్యదర్శి  ఎల్.వి రమణ, రిఫరీ బోర్డు చైర్మన్ ఎస్  సూర్యారావు, జాయింట్ సెక్రటరీలు సిహెచ్ విఆర్ఎస్ రాజు, రామకృష్ణ యాదవ్, డి తిరుపతి రావు, కే ఏ బాలకృష్ణ, కె తౌడు బాబు పాల్గొన్నారు.

Related posts

బంజారాహిల్స్ పోలీసులపై మత్తులో ఉన్న యువ‌తి దాడి

Satyam NEWS

5 లక్షల శ్రీవారి దర్శన టికెట్లు గంటలో సేల్

Satyam NEWS

దారితప్పిన బాలుడిని దరికి చేర్చిన విలేకరికి సన్మానం

Satyam NEWS

Leave a Comment