26.7 C
Hyderabad
May 1, 2025 06: 11 AM
Slider తెలంగాణ ముఖ్యంశాలు

వార్త దినపత్రిక జర్నలిస్టుపై పాశవికదాడి

pjimage (5)

వార్తలు రాస్తే కొడతారా? కొట్టడమేమిటి చంపుతాం అంటున్నారు అక్రమార్కులు. ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఒక వార్త రాశాడు ఏటూరునాగారం మండల వార్త దినపత్రిక రిపోర్టర్ గంపల శివకుమార్. ఈ వార్తపై విచారణ జరిపిన రెవెన్యూ అధికారులు నిందితులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. నిజానికి ఇలాంటి సంఘటన జరిగితే అవినీతికి పాల్పడిన అధికారులు సిగ్గుపడి అవినీతి చర్యలు మానేయాలి. అయితే ఇక్కడి ఈ అధికారులు మాత్రం వార్త రాసినందువల్లే కదా తాము సస్పెండ్ అయిందని కక్ష పెంచుకుని శివకుమార్ పై కత్తులు, బీరు సీసాలతో దాడి చేశారు. రక్తం కారేలా కొట్టారు. ఈ దుర్ఘటనతో ఒక్క సారిగా ఉలిక్కిపడిన జర్నలిస్టు సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ములుగు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ని కలిసి  దోషులను కఠినంగా శిక్షించాలని TUWJ వినతి పత్రం సమర్పించింది. ఏటూరునాగారం వార్త విలేఖరి శివ పై దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ములుగు జిల్లా కలెక్టర్ సీ. నారాయణ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పర్యటనలో ఉన్న ములుగు కలెక్టర్ నారాయణరెడ్డిని టీయూడబ్ల్యుజే (H-143) రాష్ట్ర నాయకులు టీ. రాజనారాయణ నేతృత్వంలో యూనియన్ బృందం కలసి వినతిపత్రం అందించారు. శివపై దాడికి పాల్పడిన వారిపై వెంటనే కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. కలెక్టర్ నారాయణరెడ్డి వెంటనే స్పందించి… ములుగు ఎస్పీతో మాట్లాడారు. నిందితులపై కేసు నమోదు చేయాలని కోరారు. పత్రిక స్వేచ్ఛకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని tuwj ప్రతినిధులకు చెప్పారు. కలెక్టర్ ను కలిసిన వారులో భూపాలపల్లి ఉమ్మడి జిల్లా tuwj జాయింట్ సెక్రటరీ వెంకటేష్, వేణుగోపాల్ రెడ్డి,  మహాదేవపూర్ పాత్రికేయులు నాగరాజు , మహేష్ , శ్రీకాంత్ ,దీను , తదితరులున్నారు

Related posts

రిటైర్మెంట్ ఉద్యోగానికే కానీ వ్యక్తిత్వానికి కాదు

Satyam NEWS

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు నీలి మీడియా వక్ర భాష్యం

Satyam NEWS

ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి  బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!