28.7 C
Hyderabad
April 20, 2024 06: 21 AM
Slider ఆదిలాబాద్

ప్రభుత్వ ఉద్యోగాలలో ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలి

PDSU Adilabad

తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 90 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని అదిలాబాద్ జిల్లా PDSU ఉపాధ్యక్షుడు రాథోడ్ దేవి లాల్ డిమాండ్ చేశారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం స్థానిక జూనియర్ కళాశాల లో నిర్వహించారు.

ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా DTF జిల్లా అధ్యక్షుడు  శ్రీనివాస్, టీ జాక్ అధ్యక్షులు దేవేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాథోడ్ దేవిలాల్ మాట్లాడుతూ నిరుద్యోగులకు కు భృతి ఇవ్వాలని, అదేవిధంగా అదిలాబాద్ జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ కేజీ టు పీజీ ఉచిత విద్య అమలు చేయాలని, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని  డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో లో పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షులు వినోద్ వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు రాహుల్ భాస్కర్ నగేష్ కపిల్ రాహుల్  కేశవ్ సాగర్ సచిన్ సచిన్ సుజయ్ జగన్ యువజన సంఘ నాయకులు దేవేందర్ కార్మిక కార్మిక సంఘం నాయకులు జగన్ AISF, SFI, AISB, TAVS, VBA, AIYF, DTF, IFTU, వివిధ విద్యార్థి ఉపాధ్యాయ యువజన కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Related posts

అన్నమయ్య జిల్లా సాధన కోసం రిలే నిరాహారదీక్ష

Satyam NEWS

రోడ్డు ప్రక్కన చిరు వ్యాపారులపై అక్రమ చలాన్ల వసూలు నిలిపివేయాలి

Satyam NEWS

చీరాల టిడిపి టిక్కెట్ నాదే: కొండయ్య స్పష్టీకరణ

Satyam NEWS

Leave a Comment