39.2 C
Hyderabad
March 28, 2024 13: 41 PM
Slider నెల్లూరు

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో రెండో విడత కో వ్యాక్సీనేషన్ పూర్తి

#VikramsimhapuriUniversity

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో బోధన, బోధనేతర సిబ్బందికి రెండో విడత కో వ్యాక్సీనేషన్ వేయడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్ .విజయ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ రెండో విడత తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా కాసుమూరు PHS వైద్యులు సహకరంతో 45 సంవత్సరాలు దాటిన ఉద్యోగులందరికి కో వ్యాక్సిన్ రెండో విడత రెండు డోస్ ఇప్పించామని చెప్పారు.

అందుకోసం వైద్యులకి ,DMHO కు విశ్వవిద్యాలయం తరుపున ధన్యవాదాలు తెలియచేశారు. కోవిడ్ నేపద్యంలో వ్యాక్సినేషన్ మీద ఉన్న కొన్ని అపోహలు తగ్గినప్పటికి ఇప్పటికీ దాని వల్ల ఏదో అవుతుందని కొంతమంది అనుకుంటున్నారని ఆయన అన్నారు. అటువంటిది ఏమి లేదని విశ్వవిద్యాలయ సిబ్బందికి రెండో డోసులు పూర్తి చేశామని వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల వ్యాధి తీవ్రత మనిషి ప్రాణాల ముప్పు దాకా రాకుండా కాపాడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెప్పిన అంశాన్ని ఆయన గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్న NSS కోఆర్డినటర్ ఉదయ్ శంకర్ అల్లం కు, NSS సిబ్బందికి, వాలంటీర్ల కు, డాక్టర్ శంకరయ్య కు ఆయన ధన్యవాదాలు చెప్పారు. డా శంకర్ మాట్లాడుతూ 45 సంవత్సరాలు పైబడిన వారిని గుర్తించి వారందరికీ రెండో విడత కొవ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలిపారు. జిల్లా వైద్య అధికారి డాక్టర్ మల్లికార్జున్ కు, DEOకి, ప్రొగ్రాం ఆఫీసర్ కి, HEO ఓ శ్రీనివాసులుకి మెడికల్ అఫిసర్ దగ్గరుండి అన్నీ సహకరించారని ఆయన తెలిపారు.

రెక్టార్ ఆచార్య ఎం చంద్రయ్య కసుమురు వైద్య బృందానికి, డా శంకర్ కి NSS సమన్వయకర్త డా ఉదయ్ శంకర్ అల్లం కి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్న NSS సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ జాతీయ సేవ పథకం సమన్వయకర్త డా ఉదయ్ శంకర్ అల్లం మాట్లాడుతూ ప్రజలు వ్యాక్సిన్ పట్ల ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా వేయించుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సుజ ఎస్ నాయర్, సహాయక రిజిస్ట్రార్ డా సుజయ్ కుమార్, పరీక్షల నియంత్రణాధికారి డా సాయి ప్రసాద్ రెడ్డి, బోధన బోధనేతర సిబ్బంది, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

జగన్ రెడ్డి ఈ మాట అప్పుడే చెప్పాల్సింది

Satyam NEWS

పోలియో రహిత సమాజం కోసం కృషి చేయాలి

Satyam NEWS

హైదరాబాద్ ప్రజల విశ్వాసం చూరగొన్న బిజెపి రధ సారధి

Satyam NEWS

Leave a Comment