33.2 C
Hyderabad
April 25, 2024 23: 30 PM
Slider మహబూబ్ నగర్

ఆరోగ్య కేంద్రాలలో నూటికి నూరు శాతం వాక్సినేషన్ ఇవ్వాలి

#WanapartyCollector

కోవిడ్ వాక్సినేషన్ లో భాగంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో నూటికి నూరు శాతం వాక్సినేషన్ ఇవ్వాలని వనపర్తి జిల్లా కలెక్టర్  షేక్ యాస్మిన్ భాష ఆదేశించారు.

సోమవారం రాత్రి ఆమె కలెక్టర్ తన చాంబర్ లో మొదటి విడత  వాక్సినేషన్ పై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు .

ప్రభుత్వ ఆదేశాల మేరకు మొదటి విడత వాక్సినేషన్ లో భాగంగా జిల్లా లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఉదయం 2, సాయంత్రం రెండు స్లాట్ లు బుక్ చేసుకోవాలని, 25 మంది ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. 

ఎట్టి పరిస్థితుల్లో నూటికి నూరుశాతం ఆన్లైన్లో నమోదు చేసుకున్న వాళ్ళందరికీ కవర్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

వాక్సినేషన్ లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు చూడాలని అన్నారు.

కార్యక్రమాన్నీ పర్యవేక్షించేందుకు నలుగురు ప్రోగ్రాం అధికారులను కలెక్టర్ నియమించారు. ఎప్పటికప్పుడు ఈ విషయం పై నివేదిక సమర్పించాలని ఆమె ఆదేశాలు జారీ చేశారు.

ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీనివాసులు,ఇంమ్యునైజెషన్  అధికారి డాక్టర్ రవి శంకర్ ,డాక్టర్ హరీష్, జిల్లా సంక్షేమ అధికారి పుష్పలత  తదితరులు హాజరయ్యారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి

Related posts

రాజ్యాంగం పై అందరికి అవగాహన ఉండాలి

Satyam NEWS

బేలా బై పాస్ రోడ్డు మంజూరికి వినతి పత్రం

Satyam NEWS

జగన్ రాజకీయ చిత్రానికి సెన్సార్ కత్తెరలు

Satyam NEWS

Leave a Comment